Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs WI: 4 బంతుల్లో 3 వికెట్లు.. నిప్పులు చెరిగిన అరంగేట్ర పేసర్! (వీడియో)

ఇంగ్లండ్ అరంగేట్ర పేసర్ గస్ అట్కిన్సన్ నిప్పులు చెరిగాడు. వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి టెస్ట్‌తో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన అట్కిన్సన్(7/45).. ఏడు వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. తద్వారా అరంగేట్రంలో ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ గణంకాలను నమోదు చేసిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఓవరాల్‌గా 9వ బౌలర్‌గా నిలిచాడు.

అట్కిన్సన్ వేసిన 35వ ఓవర్‌లో నాలుగు బంతుల వ్యవధిలో ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్ చేరారు. అట్కిన్సన్ సంచలన బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులకు కుప్పకూలింది. అట్కిన్సన్ ధాటికి క్రెయిగ్ బ్రాత్ వైట్(6), అలిక్ అథనాజ్(23), కిర్క్ మెకెంజీ(1), జాసన్ హోల్డర్(0), జాషువ డసిల్వ(0), అల్జరీ జోసెఫ్(17), షమార్ జోసఫ్(0)లు దారుణంగా విఫలమయ్యారు. వీడ్కోలు మ్యాచ్ ఆడుతున్న జేమ్స్ అండర్సన్‌‌తో పాటు క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసారు.

ENG vs WI 3 wickets in 4 balls debutant Gus Atkinson steals limelight in 1st Test

వెస్టిండీస్ బ్యాటర్లలో మిఖైల్ లూయిస్(27), అలిక్ అథనాజ్(23), కవెమ్ హాడ్జ్(24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 31.1 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. 32 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. ఓపెనర్ జాక్ క్రాలీ(89 బంతుల్లో 14 ఫోర్లతో 76), ఓలీ పోప్(74 బంతుల్లో 11 ఫోర్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించారు. క్రీజులో జోరూట్‌(5 బ్యాటింగ్)తో పాటు హ్యారీ బ్రూక్(0 బ్యాటింగ్) ఉన్నాడు.

అరంగేట్రంలో అత్యుత్తమ గణంకాలు నమోదు చేసిన ఇంగ్లండ్ బౌలర్లు:

డోమినిక్ కార్క్-7/43(19.3)-ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్(లార్డ్స్, 1995)

గస్ అట్కిన్సన్-7/45(12)-ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్(లార్డ్స్, 2024)

జాన్ లెవెర్-7/46(23)-ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా(ఢిల్లీ, 1976)

అలెక్ బెడ్సెర్-7/49(29.1)- ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా(లార్డ్స్, 1946)

జేమ్స్ లాంగ్రిండ్జ్-7/56(17)-ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్(మాంచెస్టర్, 1933)

Story first published: Wednesday, July 10, 2024, 22:59 [IST]
Other articles published on Jul 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+