Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్!

అంతర్జాతీయ వన్డేలో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఒక్క ప్లేయర్ కూడా సెంచరీ చేయకుండా 400 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డుకెక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఈ ఫీట్ సాధించింది. బర్మింగ్‌హామ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 400 పరుగులు చేసింది.

బెన్ డక్కెట్(60), జోరూట్(57), హ్యారీ బ్రూక్(58), జాకోబ్ బెతెల్(82) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జేమీ స్మిత్(37), విల్ జాక్స్(39) విలువైన పరుగులు చేశారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు 30 ప్లస్ రన్స్ చేయడం కూడా ఇదే తొలిసారి.

ENG vs WI 1st ODI England creates history with unique record against West Indies

ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ రెండు రికార్డ్‌లను తమ పేరిట లిఖించుకుంది. వెస్టిండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్(4/84) నాలుగు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, జస్టిన్ గ్రీవ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం వెస్టిండీస్ 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. సకీబ్ మహ్మూద్ మూడు వికెట్ల తీయగా.. బ్రైడన్ కార్స్, జాకోబ్ బెతెల్ చెరో వికెట్‌తో వెస్టిండీస్‌ను దెబ్బతీసారు.

Story first published: Thursday, May 29, 2025, 23:36 [IST]
Other articles published on May 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+