For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 WC 2021: సౌతాఫ్రికా కొంప ముంచిన రన్‌రేట్.. ఇంగ్లండ్‌పై గెలిచినా దక్కని సెమీస్ బెర్త్!

Kagiso Rabada takes hat-trick

షార్జా: టీ20 ప్రపంచకప్ 2021లో సౌతాఫ్రికా పోరాటం లీగ్ దశలోనే ముగిసింది. శనివారం ఇంగ్లండ్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలుపొందినా సెమీస్ బెర్త్ దక్కించుకోలేకపోయింది. నెట్‌రన్‌రేట్ తక్కువగా ఉండటంతో టోర్నీలో తృటిలో సెమీస్ అవకాశాన్ని చేజార్చుకుంది. తమ కంటె మెరుగైన రన్ రేట్ కలిగిని ఆస్ట్రేలియా సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గ్రూప్-1‌లో నాలుగేసి విజయాలతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వరుసగా మూడు స్థానాల్లో నిలవగా.. మెరుగైన రన్ రేట్ కలిగిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టోర్నీలో ముందడుగు వేసాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 130 పరుగులలోపు ఆలౌట్‌ చేసి ఉంటే సౌతాఫ్రికాకు సెమీస్ చేరే అవకాశం ఉండేది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 2 వికెట్లకు 189 పరుగుల చేసింది. వాన్ డెర్ డస్సెన్ (60 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 నాటౌట్), ఎయిడెన్ మార్​క్రమ్ (25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. సెమీస్​ చేరాలంటే మెరుగైన రన్​రేట్​ సాధించాల్సిన నేపథ్యంలో ధాటిగా ఆడుతూ అర్ధ శతకాలు బాదారు. క్వింటన్ డికాక్ (27 బంతుల్లో 4 ఫోర్లతో 34) సైతం ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 179 రన్స్ మాత్రమే చేసి ఓటమిపాలైంది. మోయిన్ అలీ(27 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37), డేవిడ్ మలాన్(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), లివింగ్ స్టోన్(17 బంతుల్లో, ఫోర్, 3 సిక్స్‌లతో 28) మినహా అంతా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా మూడు వికెట్లు తీయగా.. షంసీ, ప్రెటోరియస్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అన్రిచ్ నోర్జ్‌కు ఓ వికెట్ దక్కింది. అయితే చివరి ఓవర్‌లో ఇంగ్లండ్ విజయానికి 14 పరుగుల అవసరమవ్వగా.. రబడా హ్యాట్రిక్ వికెట్ తీసి అద్భుత విజయాన్నందించాడు. ఫస్ట్ బాల్‌కు క్రిస్ వోక్స్‌ను నోర్జ్ సూపర్ క్యాచ్ సాయంతో పెవిలియన్ చేర్చిన రబడా.. రెండో బంతికి మోర్గాన్‌, మూడో బంతికి క్రిస్ జోర్డాన్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ షాట్లు ఆడాలనే ప్రయత్నంలోనే ఈ ముగ్గురు ఔటయ్యారు.

190 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు వరుస బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, 15 బంతుల్లో 20 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్న జాసన్ రాయ్ గాయంతో రిటైర్ హర్డ్ గా వెనుదిరిగాడు. అయినా మరో ఓపెనర్ జోస్ బట్లర్ వేగం తగ్గించలేదు. క్రీజులో పాతుకుపోతున్నబట్లర్‌ను అన్రిచ్ నోర్జ్.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 59 రన్స్ చేసింది. ఆ వెంటనే స్పిన్నర్లను బరిలోకి దించిన సౌతాఫ్రికా టీమ్.. డేంజరస్ బ్యాట్స్‌మన్ బెయిర్ స్టో‌ వికెట్ రాబట్టింది. షంసీ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరిగాడు.

ఈ పరిస్థితుల్లో మొయిన్ అలీ, డేవిడ్ మలాన్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. మూడో వికెట్ కు 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుస బౌండరీలతో ఊపుమీదున్న మొయిన్ అలీ(37)నీ షంసీ బోల్తా కొట్టించాడు. డేవిడ్ మలాన్ కూడా 33 పరుగులు చేసి పెట్రోరియస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖర్లో లివింగ్ స్టోన్, మోర్గాన్, క్రిస్ వోక్స్ మెరుపు బ్యాటింగ్ చేసినప్పటికీ.. రబడా హ్యాట్రిక్‌తో చెలరేగడంతో ఫలితం లేకుండా పోయింది.

Story first published: Saturday, November 6, 2021, 23:51 [IST]
Other articles published on Nov 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+