For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs SA: క్లాసెన్ కాక విధ్వంసం.. మార్కో మామ ఊర మాస్ బ్యాటింగ్!

ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా: వన్డే ప్రపంచకప్ (World Cup 2023)లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు దుమ్మురేపారు. పసికూన నెదర్లాండ్స్ ఇచ్చిన షాక్ నుంచి త్వరగానే తేరుకున్న సఫారీ బ్యాటర్లు.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రీచ్ క్లాసెన్(67 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 109) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. రీజా హెండ్రీక్స్(75 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 85), రాసీ వాన్ డెర్ డస్సెన్(61 బంతుల్లో 8 ఫోర్లతో 60), మార్కో జాన్సెన్(42 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

Jansen South Africa

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టోప్లీ(3/63) మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్(2/61), గస్ అట్కిన్సన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

డికాక్ ఔటైనా..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ క్వింటన్ డికాక్(4) టోప్లీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన డస్సెన్‌తో హెండ్రీక్స్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఈ జోడీ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది.

ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన ఈ జోడీ వేగంగా పరుగులు చేసింది. 16 ఓవర్లలో సౌతాఫ్రికా 100 పరుగుల మార్క్ అందుకోగా.. డస్సెన్ 49 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే హెండ్రీక్స్ కూడా 48 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అనంతరం మరింత నిలకడగా ఆడిన ఈ జోడీ 121 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా కనిపించింది.

South Africas Reeza Hendricks is bowled out

భారీ భాగస్వామ్యం..
స్పిన్నర్ ఆదిల్ రషీద్.. డస్సెన్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి ఈ భారీ భాగస్వామ్యానికి తెరదించాడు. తాత్కలిక కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్‌తో కలిసి హెండ్రీక్స్ ధాటిగా ఆడాడు. సెంచరీకి చేరువైన అతన్ని రషీద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి హెన్రీచ్ క్లాసెన్ రాగా.. హాఫ్ సెంచరీకి చేరువైన మార్క్‌రమ్‌ను టోప్లీ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన మిల్లర్(5) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు.

ENG vs SA: Heinrich Klaasen ton helps Proteas set 400-run target

క్లాసెన్ కాక విధ్వంసం..
ఈ పరిస్థితుల్లో మార్కో జాన్సెన్‌తో కలిసి హెన్రీచ్ క్లాసెన్ చెలరేగాడు. ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడటంతో సఫారీ స్కోర్ బోర్డు వేగంగా పరుగెత్తింది. 61 బంతుల్లో క్లాసెన్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మార్కో జాన్సెన్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి ఓవర్‌లో క్లాసెన్ ఔటైనా.. జాన్సెన్ భారీ సిక్సర్లతో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 399 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో రాణించిన హెన్రీచ్ క్లాసెన్, ఎయిడెన్ మార్క్‌రమ్, మార్కో జాన్సెన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో తెలుగు అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.

Story first published: Saturday, October 21, 2023, 18:20 [IST]
Other articles published on Oct 21, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+