ENG vs SA: 8 సిక్సర్లతో బెయిర్ స్టో విధ్వంసం.. సౌతాఫ్రికాకు తప్పని పరాజయం!

బ్రిస్టోల్: సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను సమం చేసుకున్న ఇంగ్లండ్ మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసింది. బుధవారం అత్యంత ఆసక్తికరంగా సాగిన తొలి టీ20లో సౌతాఫ్రికాను 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడించింది. జానీ బెయిర్ స్టో(53 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 90) పరుగుల విధ్వంసానికి గ్లీసన్(3/51) తీన్మార్ తోడవడంతో సౌతాఫ్రికాకు పరాజయం తప్పలేదు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 234 పరుగులు చేసింది. బెయిర్ స్టోకు తోడుగా మోయిన్ అలీ(18 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 52) వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదాడు. డేవిడ్ మలాన్(23 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 43) ధాటిగా ఆడి విలువైన పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి(5/39) ఐదు వికెట్లతో చెలరేగగా.. పెహ్లుక్వాయో ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సఫారీ బ్యాటర్లో ట్రిస్టాన్ స్టబ్స్ (28 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లతో 72), రీజా హెండ్రిక్స్ (33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 57) విధ్వంసకర హాఫ్ సెంచరీలు బాదినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రీచర్డ్ గ్లీసన్ మూడు వికెట్లు తీయగా.. రీస్ టోప్లే, ఆదిల్ రషీద్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మోయిన్ అలీకి ఓ వికెట్ దక్కింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మోయిన్ అలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ రోజు రాత్రే ఇరు జట్లు రెండో టీ20లో తలపడనున్నాయి.
ఇక వన్డే సిరీస్‌లో తొలి వన్డేను సౌతాఫ్రికా 62 పరుగుల తేడాతో గెలవగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 118 పరుగులతో విజయం సాధించింది. ఇక నిర్ణయాత్మక మూడో వన్డే వర్షంతో రద్దయింది. దాంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ టీ20 సిరీస్ అనంతరం సౌతాఫ్రికా ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనుండగా.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఆగస్టు 17 నుంచి మూడు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications