Babar Azam గొప్ప బ్యాట్స్‌మన్ కానీ గొప్ప కెప్టెన్ కాదు.. మార్చేయాలి లేకుంటే పాక్ మరో కెన్యా అవుతోంది!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ బీ టీమ్ చేతిలో వన్డే సిరీస్ కోల్పోవడాన్ని పాకిస్థాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోవడాన్ని సహించలేకపోతున్నారు. ఈ దారుణ ఓటమికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటున్నారు.
మంగళవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్ భారీ స్కోర్ చేసినా.. విజయం సాధించలేకపోయింది. ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శన ముందు తేలిపోయింది. ఫలితంగా మూడు వికెట్లతో మ్యాచ్‌ను గెలుచుకున్న బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ టీమ్.. 3-0తో సిరీస్‌ను సైతం కైవసం చేసుకుంది.
బాబర్ సెంచరీతో చెలరెగినా..?
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 158) సెంచరీతో చెలరేగినా ఓటమి తప్పలేదు. అయితే బ్యాట్స్‌మన్‌గా ఆకట్టుకున్న బాబర్ కెప్టెన్‌గా విఫలమయ్యాడని విమర్శకులు మండిపడుతున్నారు. భారీ స్కోర్‌ను కాపాడుకోలేని అసమర్థ కెప్టెన్ అని విమర్శిస్తున్నారు.
బౌలింగ్ వ్యూహాలు, ఫీల్డింగ్ సెటప్ విషయంలో బాబర్ చాలా వీక్ అని, అతన్ని వెంటనే కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఇతర సీనియర్ ప్లేయర్లకు కెప్టెన్సీ ఇవ్వాలంటున్నారు. ఫస్ట్ వన్డేలో డకౌట్‌గా వెనుదిరిగిన బాబర్.. రెండో వన్డేలో 19 పరుగులు మాత్రమే చేశాడు. మూడో వన్డేలో సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
మరో కెన్యా కాకుండా..
అనామక జట్లతో ఎదురవుతున్న వరుస పరాజయాలపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ మరో కెన్యా జట్టులా మారుతుందా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కెన్యా టీమ్ అడ్రస్ లేకుండా పోయింది, కానీ ఒకప్పుడు అదరగొట్టింది. పెద్ద క్రికెట్ జట్టుగా వెలుగొందింది. వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆ జట్టు ఆడిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బలంగా ఉండేదని. అయితే ఆ తర్వాత ఆ దేశం క్రికెట్‌లో బలహీనమై పూర్తిగా కనుమరుగయిపోయింది. ఇప్పుడు పాక్ పరిస్థితి కూడా అలానే ఉందని హెచ్చరిస్తున్నారు. వెంటనే కోచ్‌లు, కెప్టెన్‌లను మార్చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
బాబర్ బెస్ట్ బ్యాట్స్‌మన్..
ఇక బాబర్‌కు అండగా కూడా నిలుస్తున్నారు. జట్టు మొత్తం చేసిన పరుగులను అతనొక్కడే చేశాడని కొనియాడుతున్నారు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌ను సొంత దేశ అభిమానులే తిట్టడం దారుణమని కామెంట్ చేస్తున్నారు. బాబర్ అద్భుతంగా రాణించాడని కొనియాడుతున్నారు. బాబర్ ఇన్నింగ్స్‌కు పిధా అయిన ప్రేక్షకులు అతను మైదానం వెళ్తుంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. బాబర్ వల్లే పాక్ అంతో ఇంతో రాణిస్తుందని ఎదురు దాడికి దిగుతున్నారు. ఇక హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్‌లపై సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిరీస్ క్లీన్ స్వీప్..
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 158) సెంచరీకి అండగా ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), మహ్మద్ రిజ్వాన్(74) రాణించారు. రిజ్వాన్‌తో కలిసి 179 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పిన బాబర్.. ఇమామ్‌తో 92 పరుగులు జోడించాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పర్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ 48 ఓవర్లలో 7 వికెట్లకు 332 పరుగులు చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. జేమ్స్ విన్స్(95 బంతుల్లో 11 ఫోర్లతో 102) సూపర్ సెంచరీతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications