For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs PAK: బాబర్ ఆజామ్ X షాహిది అఫ్రిది డిష్యూం డిష్యూం! (వీడియో)

ENG vs PAK: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్, స్టార్ పేసర్ షాహిది అఫ్రిది మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ ముందు నుంచే ఈ ఇద్దరు గొడవపడుతున్నారు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్ దారుణ వైఫల్యంతో ఆ జట్టు రెండు వర్గాలుగా విడిపోయింది.

డ్రెస్సింగ్ రూమ్‌లో ఘర్షణ వాతావరణం కూడా నెలకొందని, ఇద్దరూ తీవ్రంగా గొడవపడ్డారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఈ పాకిస్థాన్ ఆటగాళ్ల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు కెమెరాకు చిక్కాయి.

ENG vs PAK: Shaheen Afridi in shock after Babar Azam hits Mohammad Rizwan in anger

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటింగ్ సందర్భంగా షాహిన్ అఫ్రిది వికెట్ తీయగా.. బాబర్ ఆజామ్ అతన్ని అభినందించేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా కీపర్ మహమ్మద్ రిజ్వాన్ షాహిన్ అఫ్రిదికి హైఫై ఇస్తుండగా బాబర్ ఆజామ్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. షాహిన్ అఫ్రిది కన్నా ముందే రిజ్వాన్‌కు హైఫై ఇచ్చిన బాబర్ ఆజామ్.. అతని చేతులను గట్టిగా కొట్టాడు.

బాబర్ ఆజామ్ అనుచిత ప్రవర్తనతో షాహిది అఫ్రిది ఆగ్రహానికి గురయ్యాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ప్రపంచకప్ వైఫల్యంతో బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశం ఉంది. అతని సారథ్యంపై వేటు వేసి షాహిద్ అఫ్రిదికి జట్టు పగ్గాలు అందించే యోచనలో పీసీబీ ఉన్నట్లు పాకిస్థాన్ మీడియా వరుస కథనాలు ప్రచురిస్తోంది.

పాకిస్థాన్ అభిమానులు మాత్రం ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'ఏందీరా? ఇది.. అసలు ఏం జరుగుతోంది? మీ గొడవలతో జట్టును నాశనం చేస్తున్నారు కదా..?'అంటూ మండిపడుతున్నారు. జట్టులో రాజకీయాలు చేస్తున్న ఆటగాళ్లందర్నీ తీసిపారేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ధాటిగా ఆడి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్(76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), జో రూట్(72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్‌స్టో(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.

హ్యారీస్ రౌఫ్(3/59) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/72), మహమ్మద్ వాసీమ్(2/74) రెండేసి వికెట్లు పడగొట్టారు.. ఇఫ్తికర్ అహ్మద్‌(1/38)కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్.. 145 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతోంది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్(0), ఫకార్ జమాన్(1), ఇఫ్తికర్ అహ్మద్(3) దారుణంగా విఫలమవ్వగా.. బాబర్ జామ్(38), రిజ్వాన్(36), సౌద్ షకీల్(26) నిలకడగా ఆడే ప్రయత్నం చేసి వెనుదిరిగారు. అఘా సల్మాన, షాదాబ్ ఖాన్ క్రీజులో ఉన్నారు.

Story first published: Saturday, November 11, 2023, 20:50 [IST]
Other articles published on Nov 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+