
కార్డీఫ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్థాన్ 141 పరుగులకే కుప్పకూలింది. బెన్‌స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ బీ టీమ్ దెబ్బకు పాక్ బ్యాట్స్‌మన్ విలవిలలాడారు. వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజామ్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరగ్గా.. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. ఫకార్ జమాన్(47), మహ్మద్ రిజ్వాన్(13), సోహైబ్ మక్సూద్(19), షాదాబ్ ఖాన్ (30), షాహీన్ షా అఫ్రిదీ(12), మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 35.2 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది.
సఖీబ్ మహ్మూద్ (4/42) నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. క్రైగ్ ఓవర్టన్(2/23), మ్యాట్ పార్కిన్సన్ (2/28) రెండేసి వికెట్లు తీశారు. మహ్మూద్ ధాటికి పాక్ ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. మూడు బంతుల వ్యవధిలోనే ఓపెనర్ ఇమామ్, కెప్టెన్ బాబర్ ఆజామ్ పెవిలియన్ చేరారు. ఐదో వికెట్‌కు సోహైబ్ మక్సూద్, ఫకార్ జమార్ 53 పరుగుల భాగస్వామ్యం అందించడంతో పాక్ గౌరవ ప్రదమైన స్కోర్ అందుకుంది.
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీసు తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టును కరోనా వైరస్ వెంటాడింది. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయ సిబ్బందికి పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అందరినీ ఐసోలేషన్‌కు పంపించి చికిత్స అందిస్తోంది. పాక్‌తో సిరీసుకు బెన్‌స్టోక్స్ సారథ్యంలో కొత్త ఆటగాళ్లతో అప్పటికప్పుడు మరో జట్టును ఎంపిక చేసింది. దాదాపు ఇంగ్లండ్ బీ టీమ్ అయిన బెన్ స్టోక్స్ సేనతోనూ పాక్ బ్యాటింగ్ ఆర్చర్ పతనమవ్వడం క్రికెట్ అభిమానులను విస్మయపరుస్తోంది.