ENG vs PAK: పాకిస్థాన్ చెత్త రికార్డ్.. 2 ఇన్నింగ్స్‌ల్లో సున్నాకే వికెట్!
టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ టీమ్ చెత్త రికార్డ్ నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు నమోదు చేయలేని అత్యంత చెత్త ఫీట్‌ను తమ పేరిట లిఖించుకుంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది.
ఆ జట్టు ఇలా సున్నాకే తమ వికెట్ కోల్పోవడం ఇది ఏడోసారి. దాంతో అత్యధిక సార్లు ఈ చెత్త ఫీట్ సాధించిన తొలి టీమ్‌గా పాకిస్థాన్ అప్రతిష్టను మూటగట్టుకుంది. టెస్ట్‌ల్లో మరే జట్టు కూడా ఈ ఫీట్ నమోదు చేయలేదు. పాకిస్థాన్ ఇప్పటి వరకు 472 టెస్ట్‌లు ఆడగా.. ప్రతీ 68 మ్యాచ్‌లు ఒకసారి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సున్నాకే తమ తొలి వికెట్‌ను కోల్పోయింది. పాకిస్థాన్ తర్వాత ఇంగ్లండ్ 1098 టెస్ట్‌ల్లో ఐదు సార్లు ఈ చెత్త ఫీట్ నమోదు చేసింది. భారత్ రెండు సార్లు మాత్రమే ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇమామ్ ఉల్ హక్(42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/51), జోష్ టంగ్(5/46) ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు.
అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోర్డాన్ కాక్స్(73), కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), డాన్ లారెన్స్ సత్తా చాటారు. పాక్ బౌలర్లలో అలి ఉస్మాన్(5/95) ఐదు వికెట్లు తీయగా.. ఖుర్రమ్ షెహ్‌జాద్(3/133) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు. 238 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. షాన్ మసూద్(29), మహమ్మద్ రిజ్వాన్(41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

