పాకిస్థాన్ చెత్త రికార్డ్.. ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే!
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మూడో టెస్ట్‌లోనూ ఆ జట్టు దారుణంగా విఫలమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా బుధవారం ప్రారంభమైన మూడో టెస్ట్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. తొలి ఇన్నింగ్స్‌లో 33.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. సౌద్ షకీల్(47 బంతుల్లో 7 ఫోర్లతో 43), మహమ్మద్ అబ్బాస్(21) డబుల్ డిజిట్ స్కోర్లు చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/42) నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ రాబిన్సన్(3/15), జోఫ్రా ఆర్చర్(3/25) మూడేసి వికెట్లు పడగొట్టారు. టాప్-5 బ్యాటర్లు సైమ్ ఆయుబ్(0), అజాన్ అవైస్(9), అబ్దుల్లా షఫీక్(3), షాన్ మసూద్(5), బాబర్ ఆజామ్(7) సింగిల్ డిజిట్ స్కోర్లే చేసి వెనుదిరిగారు. దాంతో పాకిస్థాన్ చెత్త రికార్డ్‌ను మూటగట్టుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్‌ల్లో సింగిల్ డిజిట్‌కే టాప్-5 బ్యాటర్లు వెనుదిరగడం ఇదే తొలిసారి.

జట్టును ఆదుకుంటాడని భావించిన బాబర్ ఆజామ్ కూడా 18 బంతుల్లో 7 పరుగులే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 21 పరుగులే చేశాడు. తొలి రెండు టెస్ట్‌ల్లో ఓడి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయిన పాకిస్థాన్.. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆఖరి టెస్ట్‌కు కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఫలితం లేకపోయింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌తో పాటు ఏడుగురి ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించింది.
మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ వంటి సీనియర్ ఆటగాళ్లపై కూడా వేటు వేసింది. వారి స్థానాల్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. అయినా జట్టు ఆటలో ఎలాంటి మార్పు లేదు. దాంతో నెటిజన్లు పాకిస్థాన్ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ముఖ్యంగా బాబర్ ఆజామ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒరేయ్ ఆజామూ! ఏమిరా మీ వల్ల ఉపయోగం? నువ్వు నీ జట్టు మారదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications


