For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Eng vs Pak: ప్చ్.. బాబర్ ఆజామ్ సెంచరీతో చెలరేగినా తప్పని ఓటమి! ఇంగ్లండ్ క్లీన్ స్వీప్!

 Eng vs Pak: England sweep Pakistan After James Vince scores brilliant hundred in 3rd ODI


బర్మింగ్‌హమ్: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్దరాత్రి ధాటక జరిగిన మూడో వన్డేలో పాకిస్థాన్‌తో 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ బాబర్ ఆజామ్ (139 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 158) సెంచరీతో చెలరేగినా.. ఇంగ్లండ్ ముందు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించినా పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. ఇంగ్లండ్ యువ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్(95 బంతుల్లో 11 ఫోర్లతో 102) సూపర్ సెంచరీతో ఆ జట్టు సునాయస విజయాన్నందుకుంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్వీన్ స్వీప్ చేసింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ శుక్రవారం ప్రారంభంకానుంది.
 బాబర్ చెలరేగినా..

బాబర్ చెలరేగినా..

ఆఖరి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 331 రన్స్ చేసింది. ఓపెనర్ ఫకార్ జమాన్(6) విఫలమైనా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(56), కెప్టెన్ బాబర్ ఆజామ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు ఏకంగా 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్(74) సైతం హాఫ్ సెంచరీతో రాణించడం.. అతనితో కలిసి బాబర్ 179 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో పాకిస్థాన్ 331 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే చివరి మూడు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులు వేయడంతో ధాటిగా ఆడే ప్రయత్నంలో పాక్ బ్యాట్స్‌‌మెన్ పెవిలియన్ చేరాడు. చివరి మూడు ఓవర్లలో 26 పరుగులే చేసిన పాక్ ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది.

 ఆడుతూ పాడుతూ..

ఆడుతూ పాడుతూ..

ఇంగ్లండ్ బౌలర్లలో బ్రిడన్ కేర్స్ (5/61) ఐదు వికెట్లతో రాణించగా.. సకీబ్ మహమూద్(3/60) మూడు, మాట్ పర్కిన్సన్ ఓ వికెట్ తీశాడు. అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన ఇంగ్లండ్ ఆడుతూ పాడుతూ 48 ఓవర్లలో 7 వికెట్లకు 332 పరుగులు చేసి 12 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ఓపెనర్ డేవిడ్ మలాన్(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగినా.. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(37), ఫస్ట్ డౌనన్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ(39) మంచి ఆరంభాన్ని అందించారు.

 జేమ్స్ విన్స్ సూపర్ సెంచరీ...

జేమ్స్ విన్స్ సూపర్ సెంచరీ...

ఆ తర్వాత జేమ్స్ విన్స్ సూపర్ సెంచరీ సాధించగా.. తాత్కలిక సారథి బెన్ స్టోక్స్(32) బాధ్యాతాయుతంగా ఆడాడు. లోయారార్డర్ బ్యాట్స్‌మన్ లూయిస్ గ్రేగరీ(77) హాఫ్ సెంచరీతో చెలరేగడం.. చివర్లో క్రైగ్ ఓవర్టన్(18 నాటౌట్), బ్రిడన్ కేర్స్(12 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో ఇంగ్లండ్ విజయం లాంఛనమైంది. కరోనా కారణంగా ఈ సిరీస్‌కు కీలక ఆటగాళ్లంతా దూరమైనా.. యువ ఆటగాళ్లతో ఇంగ్లండ్ అద్భుత విజయాన్నందుకుంది. పాక్ బౌలర్లలో హ్యారిస్ రౌఫ్(4/65) నాలుగు వికెట్లు తీయగా.. షాదాబ్ ఖాన్(2/61) రెండు, హసన్ అలీ(1/69) ఒక వికెట్ దక్కించుకున్నారు.

పాక్ కొంపముంచిన తడబాటు..

పాక్ కొంపముంచిన తడబాటు..

చివరి ఓవర్లలో పాక్ తడబాటు ఆ జట్టు కొంపముంచింది. మరో 20 పరుగులు అదనంగా చేసుంటే ఫలితం మరోలా ఉండేది. మ్యాచ్ అనంతరం బాబర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బౌలింగ్ వైఫల్యం కూడా పాక్ ఓటమికి కారణమైంది. ముఖ్యంగా చిన్న చిన్న భాగస్వామ్యాలను విడదీయడంలో పాక్ బౌలర్లు చేతులెత్తేసారు. ముఖ్యంగా లోయరార్డర్ బ్యాట్స్‌మన్‌పై ఒత్తిడి తీసుకురాలేకపోయారు. స్వేచ్చగా ఆడిన ఇంగ్లండ్.. ఆల్‌రౌండ్‌షోతో అదిరిపోయే విజయాన్నందుకుంది.

Story first published: Wednesday, July 14, 2021, 8:57 [IST]
Other articles published on Jul 14, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+