Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs PAK: పాకిస్థాన్ ఘోర పరాజయం.. ప్రపంచకప్ నుంచి ఔట్!

ENG vs PAK: వన్డే ప్రపంచకప్ 2023ను పాకిస్థాన్ ఓటమితో ముగించింది. సెమీస్ రేసులో నిలవాలంటే అసాధారణ విజయాన్ని అందుకోవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దాంతో సెమీస్ రేసు నుంచి తప్పుకొని ఇంటిదారిపట్టింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో చిత్తయ్యింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో ధాటిగా ఆడి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్(76 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), జో రూట్(72 బంతుల్లో 4 ఫోర్లతో 60), జానీ బెయిర్‌స్టో(61 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు.

 ENG vs PAK: England end horror World Cup run with 93-run win over PAK

హ్యారీస్ రౌఫ్(3/59) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది(2/72), మహమ్మద్ వాసీమ్(2/74) రెండేసి వికెట్లు పడగొట్టారు.. ఇఫ్తికర్ అహ్మద్‌(1/38)కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 43.3 ఓవర్లలో 244 పరుగులకు కుప్పకూలింది. అఘా సల్మాన్(45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

బాబర్ ఆజామ్(38), మహమ్మద్ రిజ్వాన్(36), స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయారు. చివర్లో హ్యారీస్ రౌఫ్(35) మెరుపులు మెరిపించి 53 పరుగులు జోడించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్, గస్ అట్కిన్సన్, మొయిన్ అలీ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఈ మెగా టోర్నీలో పాకిస్థాన్ 9 మ్యాచ్‌లకు నాలుగు గెలిచి ఐదింటిలో ఓడి పాయింట్స్ టేబుల్‌లో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు ఇంగ్లండ్ 9 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

Story first published: Saturday, November 11, 2023, 21:58 [IST]
Other articles published on Nov 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+