Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs PAK: ఇంగ్లండ్ ఆధిపత్యం.. పాకిస్థాన్‌కు మరో ఘోర పరాజయం!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో 238 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. 76 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ జట్టు ఇంకా 160 ప్లస్ రన్స్ వెనుకంజలో ఉంది.

ఇంగ్లండ్ బౌలర్లు జోష్ టంగ్, జోఫ్రా ఆర్చర్, ఓలీ రాబిన్సన్ నిప్పులు చెరగడంతో పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు అజాన్ అవైస్(9), ఇమామ్ ఉల్ హక్(0) తీవ్రంగా నిరాశపర్చగా.. షాన్ మసూద్(29) క్రీజులో నిలబడే ప్రయత్నం చేశాడు. కానీ అతన్ని జోష్ టంచ్ పెవిలియన్ చేర్చాడు.

అబ్దుల్లా షఫీక్(15), సౌద్ షకీల్(14), కెప్టెన్ సల్మాన్ అఘా(4) కూడా వెనుదిరగడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో మహమ్మద్ రిజ్వాన్(8 బ్యాటింగ్)తో పాటు అలి ఉస్మాన్(2 బ్యాటింగ్) ఉన్నాడు. మరో సెషన్నర ఆట మిగిలి ఉండగా.. మూడో రోజు ఆటలోనే ఈ మ్యాచ్ ఫలితం తేలనుంది. అదే జరిగితే.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలవ్వనుంది.

ENG vs PAK England Dominate With Bat and Ball Pakistan Face Huge Defeat in 1st Test

అంతుకుముందు 366/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. జోర్డాన్ కాక్స్(73), కెప్టెన్ జోరూట్(66), హ్యారీ బ్రూక్(91), డాన్ లారెన్స్ సత్తా చాటారు. పాక్ బౌలర్లలో అలి ఉస్మాన్(5/95) ఐదు వికెట్లు తీయగా.. ఖుర్రమ్ షెహ్‌జాద్(3/133) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే కుప్పకూలింది. అబ్దుల్లా షఫీక్(61) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇమామ్ ఉల్ హక్(42) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్(5/51), జోష్ టంగ్(5/46) ఐదేసి వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించారు. గాయంతో బాబర్ ఆజామ్ ఈ మ్యాచ్‌కు దూరమవ్వడంతో పాక్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా మారింది. ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలబడలేకపోయాడు.

Story first published: Friday, August 21, 2026, 19:13 [IST]
Other articles published on Aug 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+