పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి పాకిస్థాన్ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 36 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు బాబర్ ఆజామ్ 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 4037 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీ తర్వాత..
అతను 117 మ్యాచ్‌ల్లో 109 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలతో ఈ ఫీట్ సాధించాడు. బాబర్ ఆజామ్ 119 మ్యాచ్‌లు, 112 ఇన్నింగ్స్‌ల్లో 4023 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో మూడు శతకాలతో పాటు 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ(3974), పాల్ స్టిర్లింగ్(3589), మార్టిన్ గప్టిల్(3531) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
తొలి కెప్టెన్‌గా..
అంతర్జాతీయ టీ20ల్లో 2500 పరుగులు చేసిన తొలి కెప్టెన్‌గా బాబర్ ఆజామ్ రికార్డు అందుకున్నాడు. ఇప్పటి వరకు బాబర్ ఆజామ్ 81 మ్యాచ్‌లకు సారథిగా వ్యవహరించి 2520 పరుగులు చేశాడు. అతని తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 76 మ్యాచ్‌ల్లో 2236 పరుగులతో ఉన్నాడు. ఈ ఇద్దరి తర్వాత కేన్ విలియమ్సన్(2125), రోహిత్ శర్మ(1648), విరాట్ కోహ్లీ(1570) ఈ జాబితాలో కొనసాగుతున్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ బాబర్ ఆజామ్ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు అతను ఇంగ్లండ్‌పై 140 స్ట్రైక్‌రేట్‌తో 641 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను విరాట్ కోహ్లీ(639), ఆరోన్ ఫించ్(619)లను అధిగమించాడు.
పాక్ పరాజయం..
బాబర్ ఆజామ్ పలు రికార్డులు నమోదు చేసినా.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. బాబర్ ఆజామ్(22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36), ఉస్మాన్ ఖాన్(21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(2/35), ఆదిల్ రషీద్(2/27), లివింగ్ స్టోన్(2/17) రెండేసి వికెట్లతో సత్తా చాటారు.
అనంతరం ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి 27 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఫిల్ సాల్ట్(24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), జోస్ బట్లర్(21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 39) రాణించారు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ ఒక్కడే మూడు వికెట్లు తీసాడు. ఈ ఓటమితో నాలుగు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ 0-2తో కోల్పోయింది.