Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs NZ Semi Final T20 WC 2021: జాసన్ రాయ్ ఔట్.. సామ్ బిల్లింగ్స్ ఇన్! ఇంగ్లండ్‌దే బ్యాటింగ్!

Unchanged New Zealand bowl, England replace Roy with Billings

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో ఆసక్తికర సమరానికి తెరలేచింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తేమ ప్రభావం నేపథ్యంలోనే చేజింగ్‌ ఎంచుకున్నానని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు. ప్రత్యర్థి ఇంగ్లండ్ బలమైన జట్టని, వారి బ్యాటింగ్‌లో డెప్త్ ఉందన్నాడు. అదే వారి బలమని, తాము గుడ్ క్రికెట్ ఆడటంపైనే దృష్టి సారిస్తామన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

ఇక టాస్ ఓడిన ఇయాన్ మోర్గాన్.. టాసే మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ణయిస్తుందని తాను అనుకోవడం లేదన్నాడు. గాయంతో జాసన్ రాయ్ దూరమయ్యాడని, అతని స్థానంలో సామ్ బిల్లింగ్స్ వచ్చాడన్నాడు. జాసన్ రాయ్ గైర్హాజరీ నేపథ్యంలో జానీ బెయిర్ స్టో ఓపెనింగ్ చేస్తాడన్నాడు. న్యూజిలాండ్‌తో ఆడటం సవాల్‌తో కూడుకున్నదని, ఆ జట్టుతో కీలక పోరుల్లో ఆడటం ఇదే తొలిసారి కాదన్నాడు.

మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి నాటి 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మిగిలిపోయిన ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరో వైపు ఇంగ్లండ్ సైతం వన్డే ప్రపంచకప్ మాదిరే టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవాలనుకుంటుంది.

తుది జట్లు:

ఇంగ్లండ్: జోస్ బట్లర్(కీపర్), జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

న్యూజిలాండ్: మార్టిన్ గప్టిల్, డార్లీ మిచెల్, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డేవాన్ కాన్వే(కీపర్), గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్

Story first published: Wednesday, November 10, 2021, 19:24 [IST]
Other articles published on Nov 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+