Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs NZ Semi Final T20 WC 2021: చెలరేగిన మొయిన్ అలీ.. న్యూజిలాండ్ ముందు టఫ్ టార్గెట్!

Moeen Ali 51 not out takes England to 166 for 4 in Abu Dhabi

అబుదాబి: మొయిన్ అలీ(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 నాటౌట్), డేవిడ్ మలాన్(30 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 41) రాణించడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్ ప్రత్యర్థి ముందు 167 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది.

మొయిన్ అలీ, మలాన్‌కు తోడుగా బట్లర్(29) రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, టీమ్ సౌథీ, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ బౌలర్లు.. స్లాగ్ ఓవర్లలో పరుగులిచ్చుకున్నారు.

ఇంగ్లండ్ ఇన్నంగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు జోస్ బట్లర్(24 బంతుల్లో 4 ఫోర్లతో 29), జానీ బెయిర్ స్టో(17 బంతుల్లో 13) శుభారంభం అందించారు. అయితే ఈ జోడీ జోరీకి ఆడమ్ మిల్నే బ్రేక్ వేసాడు. జానీ బెయిర్ స్టోను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 40 పరుగులు చేసింది. ఇక క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలాన్‌తో కలిసి బట్లర్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. వీలుచిక్కిన బంతని బౌండరీకి తరలించి ఈ జోడీ ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ ఇష్ సోదీ.. బట్లర్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి దెబ్బతీశాడు.

దాంతో మొయిన్ అలీని అప్‌ది ఆర్డర్‌లో పంపించిన ఇంగ్లండ్ అనుకున్న ఫలితాన్ని రాబట్టింది. డేవిడ్ మలాన్‌తో కలసి అతను న్యూజిలాండ్ స్పిన్నర్ల‌ను చితక్కొట్టాడు. అతనికి తోడుగా డేవిడ్ మలాన్ కూడా ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. అయితే న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ సూపర్ ఫీల్డింగ్‌తో బౌండరీలను ఆపారు. కానీ కీలక క్యాచ్‌లను మాత్రం నేలపాలు చేశారు. దాంతో ఇంగ్లండ్ బ్యాటర్లు చెలరేగారు.

అయితే జోరు మీదున్న ఈ జోడిని సౌథీ ఔట్ చేయడంతో మూడో వికెట్‌కు నమోదైన 63 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం లియామ్ లివింగ్ స్టోన్(17), ఇయాన్ మోర్గాన్(4)తో కలిసి మోయిన్ అలీ జట్టుకు పోరాడే స్కోర్‌ను అందించాడు. ఈ క్రమంలో అతను 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Story first published: Wednesday, November 10, 2021, 21:26 [IST]
Other articles published on Nov 10, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+