Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: కేన్ మామకు గాయం.. ఆందోళనలో న్యూజిలాండ్‌!!

ENG vs NZ: Left elbow injury blow for Kane Williamson ahead of WTC Final vs India
Kane Williamson out for second test | Oneindia Telugu

లండన్: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ. కివీస్ కెప్టెన్ కేఎన్‌ విలియమ్సన్‌ గాయపడ్డాడు. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ ఎడమ మోచేయికి గాయమైంది. ప్రస్తుతం అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. కివీస్ టీమ్ వైద్య బృందం అతడిని పర్యవేక్షిస్తోంది. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం మొదలయ్యే రెండో టెస్టులో కేన్ ఆడతాడో లేడో స్పష్టమైన సమాచారం లేదు. బహుశా బుధవారం కివీస్ మేనేజ్మెంట్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే కేన్‌కు అయిన గాయం చిన్నదే అని సమాచారం.

కేన్ మామకు గాయం

కేన్ మామకు గాయం

ఎడమచేతి చూపుడు వేలిలో చీలిక రావడంతో స్టార్ స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ ఇప్పటికే దూరమయ్యాడు. అయితే లెఫ్ట్ ఆర్మ్ సీనియర్ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం న్యూజిలాండ్‌కు సానుకూలాంశం. బౌల్ట్‌ కోసం మొదటి టెస్టు ఆడిన పేసర్లలో ఒకరికి విశ్రాంతినిస్తామని కివీస్ కోచ్‌ గ్యారీ స్టీడ్‌ తెలిపారు.

'లార్డ్స్‌లో ఆడిన పేస్‌ బౌలర్లంతా రెండో టెస్టు ఆడరు. బౌల్ట్‌ అందుబాటులో ఉన్నాడు. జట్టులోకి పునరాగమనం చేస్తాడు. ఎడమచేతి చూపుడు వేలికి గాయమవ్వడంతో శాంట్నర్‌ దూరమయ్యాడు. విలియమ్సన్‌ గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. బుధవారం సాయంత్రం అతడు ఆడేదిలేనిది నిర్ణయం తీసుకుంటాం' అని స్టీడ్‌ చెప్పారు.

విశ్రాంతిని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు

విశ్రాంతిని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు

బర్మింగ్‌హామ్ వేదికగా న్యూజిలాండ్‌, ఇంగ్లండ్ జట్ల మధ్య జూన్ 10 నుంచి రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత టీమిండియాతో న్యూజిలాండ్‌ ప్రతిష్ఠాత్మక ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. జూన్‌ 18న సౌథాంప్టన్ వేదికగా ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మొదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ కీలక మ్యాచ్‌కు ముందు కేన్ విలియమ్సన్‌ గాయపడటం ఆ జట్టు ఇబ్బందికరమే. అతడు త్వరగా కోలుకోవాలని కివీస్‌ కోరుకుంటోంది. ఫైనల్లో గెలవాలంటే ఆ జట్టుకు కేన్‌ ఎంతో అవసరం. దీంతో ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం.. కేన్ మామకు రెండో టెస్టులో విశ్రాంతిని ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Ollie Robinsonను క్షమించాం.. పూర్తిగా మారిపోయాడు: అండర్సన్‌

తొలి టెస్ట్ డ్రా

తొలి టెస్ట్ డ్రా

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ గట్టెక్కింది. లార్డ్స్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్‌ను రూట్ సేన 'డ్రా' చేసుకోగలిగింది. కివీస్‌ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఆదివారం ఐదో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ 3 వికెట్లకు 170 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ డామ్‌ సిబ్లే (207 బంతుల్లో 60 నాటౌట్‌) చివరి వరకు నిలువగా.. కెప్టెన్‌ జో రూట్‌ (40) రాణించాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన న్యూజిలాండ్ కొత్త ఓపెనర్ డేవాన్ కాన్వె (200: 347 బంతుల్లో 22x4, 1x6)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.

ఆకట్టుకోని కేన్

ఆకట్టుకోని కేన్

తొలి టెస్టులో కేన్‌ విలియమ్సన్‌ ఆకట్టుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 13 పరుగులకే పెవిలియన్ చేరగా.. రెండో ఇన్నింగ్స్‌లో సింగిల్‌ రన్‌కే అవుటయ్యాడు. కాగా కేన్‌ రెండుసార్లు జేమ్స్‌ అండర్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరగడం విశేషం. ఇక కెప్టెన్సీ విషయంలో కూడా ఆకట్టుకోలేకపోయాడు. అయితే కేన్‌ ఎపుడైనా ఫామ్ అందుకోగలడు. అంతర్జాతీయ కెరీర్‌లో కేన్ ఇప్పటివరకు 84 టెస్టుల్లో, 151 వన్డేల్లో, 67 టీ20 మ్యాచ్‌ల్లో కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Story first published: Wednesday, June 9, 2021, 13:22 [IST]
Other articles published on Jun 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+