Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs NZ: టీ20 తరహాలో బెయిర్ స్టో విధ్వంసం.. ఇంగ్లండ్‌దే సిరీస్!

ENG vs NZ: Jonny Bairstow quick century helps England’s series win over New Zealand

నాటింగ్‌హామ్‌: జానీ బెయిర్‌స్టో (136) సెంచరీతో దుమ్మురేపడంతో.. న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్నందుకుంది. దాంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆట చివరి రోజైన మంగళవారం న్యూజిలాండ్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 5 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది.

ట్రెంట్ బౌల్ట్‌ (3/94) దెబ్బకు.. ఒక దశలో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 93/4తో నిలవడంతో మ్యాచ్‌ డ్రా చేసుకొనేందుకు ఆతిథ్య జట్టు ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ, బెయిర్‌స్టో వీరబాదుడుకు కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (75 నాటౌట్‌) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జత కావడంతో సీన్‌ మారిపోయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 121 బంతుల్లో 179 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరికి జగతగా లీస్‌ (44) కూడా రాణించాడు.

లీస్‌ ఔటైనా స్టోక్స్‌ జతగా బెయిర్ స్టో జట్టును విజయపథంలో నడిపించాడు. టీ సమయానికి 139/4తో ఉన్న ఇంగ్లండ్‌ మరో 16 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించిందంటే బెయిర్‌స్టో-స్టోక్స్‌ ఎంతగా చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సిక్స్‌లతో హోరెత్తించిన బెయిర్‌స్టో 77 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 224/7తో ఐదోరోజు, మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ 284 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ (62) రాణించాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ (3/70), అండర్సన్‌ (2/20), పాట్స్‌ (2/32) ప్రత్యర్థిని కట్టడి చేశారు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ 539 పరుగులు చేసింది.

సంక్షిప్త స్కోర్లు

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 553 ఆలౌట్ (డారిల్ మిచెల్ 190, టామ్ బ్లండెల్ 106)

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 539 ఆలౌట్ (జో రూట్ 176, ఓలీ పోప్ 145)

న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ 284 ఆలౌట్ (డారిల్ మిచెల్ 62 నాటౌట్, విల్ యంగ్ 56)

ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 299/5 (బెయిర్ స్టో 136, బెన్ స్టోక్స్ 75 నాటౌట్)

Story first published: Wednesday, June 15, 2022, 8:05 [IST]
Other articles published on Jun 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+