For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Eng vs NZ: కళ్లు చెదిరే క్యాచ్‌లు.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలు! (వీడియో)

సౌథాంప్టన్: క్రికెట్‌లో వరల్డ్ బెస్ట్ ఫీల్డింగ్ టీమ్ ఏదంటే..? టక్కున చెప్పేది న్యూజిలాండ్. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలు బ్లాక్ క్యాప్స్‌కే సొంతం. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో కివీస్ ఆటగాళ్లు అసాధారణ క్యాచ్‌లతో ఔరా అనిపించారు. ఒకటి కాదు రెండు సూపర్బ్ క్యాచ్‌లు అందుకొని అభిమానులను అలరించారు.

మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌లతో జానీ బెయిర్ స్టో, మొయిన్ అలీ నిరాశగా పెవిలియన్ చేరారు. న్యూజిలాండ్ ఆటగాళ్ల సూపర్ క్యాచ్‌లకు బిత్తరపోయారు. ట్రెంట్ బౌల్డ్ వేసిన బౌలింగ్‌లో జానీ బెయిర్ స్టో లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి షార్ట్ కవర్స్‌ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మిచెల్ సాంట్నర్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు.

Eng vs NZ:

ఆ తర్వాత మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో మొయిన్ అలీ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన గ్లేన్ ఫిలిప్స్ ముందుకు పరుగెత్తుకుంటూ వచ్చి సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు.

ప్రస్తుతం ఈ రెండు క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. సమష్టిగా చెలరేగిన ఇంగ్లండ్ 79 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 34 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(95 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ సాంట్నర్‌కు ఓ వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ 26.5 ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(3/24), రీస్ టాప్లే(3/27) మూడేసి వికెట్లు తీయగా.. మొయిన్ అలీ(2/30) రెండు వికెట్లు, అట్కిన్సన్(1/2) ఓ వికెట్ పడగొట్టాడు. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(57) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Story first published: Monday, September 11, 2023, 17:50 [IST]
Other articles published on Sep 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+