Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs NZ: శతక్కొట్టిన మిచెల్, బ్లండెల్.. కివీస్ భారీ స్కోర్!

ENG vs NZ: England rebuild after Mitchell powers New Zealand to 553

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. డారిల్ మిచెల్‌ (190), టామ్ బ్లండెల్‌ (106) శతకాల తతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 553 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 318/4తో ఆ జట్టు రెండో రోజు, శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. మిచెల్‌ (ఓవర్‌నైట్‌ 81), బ్లండెల్‌ (ఓవర్‌నైట్‌ 67) అయిదో వికెట్‌కు 236 పరుగులు జోడించారు. బ్లండెల్‌ ఔటైన తర్వాత కూడా మిచెల్‌ చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు.

అయితే బ్రాస్‌వెల్‌ (49)తో ఆరో వికెట్‌కు 91 పరుగులు జోడించిన అతడు.. ద్విశతకానికి కొద్ది దూరంలో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3 వికెట్లు తీయగా.. స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, జాక్ లీచ్ రెండేసి వికెట్లు తీసారు. మాథ్యూ పాట్స్‌కు ఓ వికెట్ దక్కింది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టానికి 90 పరుగులు చేసింది. ఒలి పోప్‌ (51), అలెక్స్‌ లీస్‌ (34) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ ఇంకా 463 పరుగుల వెనుకంజలో ఉంది. ఇక తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

సంక్షిప్త స్కోర్లు:

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 145.3 ఓవర్లలో 553

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 26 ఓవర్లలో 90/1

Story first published: Sunday, June 12, 2022, 10:55 [IST]
Other articles published on Jun 12, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+