ENG vs NZ: డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని చేతిలో బీర్ గ్లాస్ బ్రేక్! (వీడియో)

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. అయితే తొలి రోజు ఆటలో భాగంగా కివీస్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ కొట్టిన ఓ భారీ సిక్సర్‌కు గ్యాలరీలో ఉన్న ఓ అభిమాని చేతిలోని బీర్ గ్లాస్ పగిలిపోయింది. బంతి నేరుగా వెళ్లి బీర్ గ్లాస్‌లో పడటంతో అంతా కిందపోయింది.
చల్లగా బీర్ తాగుతూ మ్యాచ్ ఎంజాయ్ చేయాలనుకున్న ఆ లేడీ ఫ్యాన్.. మిచెల్ సిక్సర్ దెబ్బకు షాక్‌కు గురైంది. ఇక బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ ప్లేయర్ మాథ్యూ పాట్స్.. బీర్ గ్లాస్ పగిలిన విధానాన్ని సైగలతో సహచర ఆటగాళ్లకు వివరించడం ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన ఇన్నింగ్స్ 56వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసి ఫ్లైటెడ్ డెలివరీని మిచెల్ స్ట్రైట్‌గా సిక్సర్ బాదాడు. బంతి కాస్త సుసాన్ అనే లేడీ ఫ్యాన్ చేతిలోని బీర్ గ్లాస్‌లో పడింది. దాంతో బీర్ అంతా చిల్లీ పక్కనున్న అభిమానులపై పడింది. కామెంటేటర్లు సైతం ఈ ఘటనను చూసి ఆశ్చరపోయారు. నవ్వుతూ ఈ సంఘటనను వివరించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న న్యూజిలాండ్ టీమ్.. సదరు అభిమానికి మరో బీర్ గ్లాస్ ఇప్పించింది. దాంతో ఆమె హాయిగా బీర్ తాగుతూ మిచెల్ బ్యాటింగ్‌ను ఆస్వాదించింది.
క్షమాపణలు చెప్పిన మిచెల్..
ఈ తొలి రోజు ఆట అనంతరం సదరు లేడీ ఫ్యాన్‌ను కలిసిన డారిల్ మిచెల్.. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. బీర్ వలకబోసినందుకు క్షమించండని స్వయంగా కోరాడు. దీనికి సంబంధించిన వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. బంతిని గమనించి క్యాచ్ పట్టుకోవాల్సింది కదా? అని అడగ్గా.. అసలు ఆ ఆలోచన తట్టలేదని, అంత టైమ్ కూడా లేదని సుసాన్ చెప్పింది. మిచెల్‌తో కలిసి ఫొటోలకు ఫోజు ఇచ్చింది. ఈ వీడియోలపై అభిమానులు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. చల్లగా మందు కూడా తాగనియ్యారా? అయ్యా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

తొలి రోజు ఇంగ్లండ్‌దే..
టాపార్డర్ రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 87 ఓవర్లలో 4 వికెట్లకు 318 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (147 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 బ్యాటింగ్), టామ్ బ్లండెల్ (136 బంతుల్లో 8 ఫోర్లతో 67 బ్యాటింగ్) అయిదో వికెట్‌కు అజేయంగా 149 పరుగులు జోడించారు. ఓపెనర్లు లేథమ్ (26), యంగ్ (47) తొలి వికెట్‌కు 84 పరుగులు జతచేసి శుభారంభం అందించారు. కాన్వే (46), నికోల్స్ (30) రాణించారు. స్టోక్స్ (2/40), అండర్సన్ (2/42) చెరో రెండు వికెట్లు తీశారు. కరోనా సోకడంతో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా..టామ్ లాథమ్ జట్టును నడిపిస్తున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications