లార్డ్స్: ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్ పట్టు సాధించింది. 152/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. ఓలిపోప్(208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 205) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌ను 524/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
ఓలిపోప్‌కు తోడుగా బెన్ డక్కెట్(178 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 182) సెంచరీతో మెరిసాడు. ఓపెనర్ జాక్ క్రాలీ(45 బంతుల్లో 11 ఫోర్లతో 56), జోరూట్(59 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56), హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో గ్రహమ్ హుమే, ఫియోన్ హ్యాండ్ తలో వికెట్ తీయగా.. ఆండీ మెక్‌బ్రైన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం 352 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఐర్లాండ్ రెండో రోజు ఆటముగిసే సమయానికి 26 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ఇంకా ఆ జట్టు 255 పరుగుల వెనుకంజలో ఉంది. హ్యారీ టెక్టర్(33 బ్యాటింగ్), లోర్కాన్ ట్రక్కర్(21 బ్యాటింగ్) పోరాడుతున్నారు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ మూడు వికెట్లు తీసాడు. మరో ఏడు వికెట్లు తీస్తే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. స్టువర్ట్ బ్రాడ్(5/51) ఐదు వికెట్లతో ఐర్లాండ్ పతనాన్ని శాసించగా.. జాక్ లీచ్ మూడు వికెట్లు తీసాడు.
మాథ్యూ పోట్స్‌కు ఓ వికెట్ దక్కింది. ఐర్లాండ్ బ్యాటర్లలో జేమ్స్ మెక్‌కల్లమ్(36), కుర్టిస్ కాంఫెర్(33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 152 పరుగులు చేసింది. రెండో రోజు అదే జోరును కొనసాగించిన ఇంగ్లండ్ భారీ స్కోర్ నమోదు చేసింది.
ముఖ్యంగా బెన్ డకెట్, ఒలిపోప్ రెండో వికెట్‌కు 352 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బెన్ డక్కెట్ తృటిలో శతకాన్ని చేజార్చుకున్నా.. జోరూట్(53)తో కలిసి ఒలిపోప్ చెలరేగాడు. జోరూట్‌తో కలిసి మూడో వికెట్‌కు 146 పరుగులు జోడించిన ఒలిపోప్.. 207 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను ఔటైన వెంటనే ఇంగ్లండ్ డిక్లెర్ ఇచ్చింది.