For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs IRE: 93 ఏళ్ల రికార్డు బద్దలు..!

లార్డ్స్: ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్(178 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 182).. 93 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో అత్యంత వేగంగా 150 పరుగుల మార్క్ అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు. 93 ఏళ్ల క్రితం 1930లో లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 166 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. క్రికెట్ మక్కా అయిన లార్ట్స్‌లో ఇదే ఫాస్టెస్ట్ 150 కాగా .. తాజాగా బెన్ డకెట్ అధిగమించాడు.

Ben Duckett

ఐర్లాండ్‌తో వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడిన డకెట్ కేవలం 150 బంతుల్లో 150 పరుగులు చేసి ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో బెన్ డకెట్, డాన్ బ్రాడ్‌మన్ తర్వాత కేవిన్ పీటర్సన్ (176 బంతులు), రాబ్ కీ (181 బంతులు), గోర్డన్ గ్రీనిడ్జ్( 189) బంతులు ఉన్నారు.

ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కల్లమ్ 103 బంతుల్లో 150 పరుగులు చేసి ఈ ఫీట్ సాధించాడు. ఆ తర్వాత మహేళ జయవర్దనే 111 బంతుల్లో, రాయ్ ఫ్రెడ్రిక్స్ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో ఈ ఫీట్ సాధించారు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు తీస్తే ఇంగ్లండ్‌ విజయం లాంఛనం కానుంది. 97/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన ఐర్లాండ్ 162 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మార్క్ అదైర్(61 బ్యాటింగ్), ఆండీ మెక్‌బ్రైన్(32 బ్యాటింగ్) పోరాడుతున్నారు. ఈ ఇద్దరూ ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో 56.2 ఓవర్లలో 172 పరుగులకు కుప్పకూలింది. స్టువర్ట్ బ్రాడ్(5/51) ఐదు వికెట్లతో ఐర్లాండ్ పతనాన్ని శాసించగా.. జాక్ లీచ్ మూడు వికెట్లు తీసాడు.

మాథ్యూ పోట్స్‌కు ఓ వికెట్ దక్కింది. ఐర్లాండ్ బ్యాటర్లలో జేమ్స్ మెక్‌కల్లమ్(36), కుర్టిస్ కాంఫెర్(33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓలిపోప్(208 బంతుల్లో 22 ఫోర్లు, 3 సిక్స్‌లతో 205) డబుల్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్‌ను 524/4 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఇంగ్లండ్‌కు 352 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

ఓలిపోప్‌కు తోడుగా బెన్ డక్కెట్(178 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 182) సెంచరీతో మెరిసాడు. ఓపెనర్ జాక్ క్రాలీ(45 బంతుల్లో 11 ఫోర్లతో 56), జోరూట్(59 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 56), హాఫ్ సెంచరీలతో రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో గ్రహమ్ హుమే, ఫియోన్ హ్యాండ్ తలో వికెట్ తీయగా.. ఆండీ మె‌క్‌బ్రైన్ రెండు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, June 3, 2023, 18:55 [IST]
Other articles published on Jun 3, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+