For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs IRE: పసికూనపై చెలరేగిన ఇంగ్లండ్.. అడ్డుకున్న వరుణ్ బ్రో!

బ్రిస్టోల్: వన్డే ప్రపంచకప్ ముందు పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-0తో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఆఖరి వన్డే వర్షంతో రద్దవడంతో సిరీస్ ఇంగ్లండ్ వశమైంది. వర్షంతో రద్దయిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. మ్యాచ్ ఆగిపోయే సమయానికి 31 ఓవర్లలో 4 వికెట్లకు 280 పరుగులు చేసింది.

ఇంగ్లండ్ యువ ఆటగాళ్లు బెన్ డక్కెట్(78 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107 నాటౌట్0 సెంచరీతో చెలరేగగా.. ఫిల్ సాల్ట్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61), జాక్ క్రాలీ(42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. విల్ జాక్స్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39) పర్వాలేదనిపించాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రైగ్ యంగ్ మూడు వికెట్లు తీయగా.. వోయిర్కమ్ ఓ వికెట్ పడగొట్టాడు.

ENG vs IRE 3rd ODI Match abandoned due to rain

వర్షం ఎంతకీ విరామం ఇవ్వకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో వన్డే ఇంగ్లండ్ 48 పరుగులతో గెలుపొందింది. మూడో వన్డే కూడా వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రధాన ఆటగాళ్లంతా వరల్డ్ కప్ కోసం సన్నదమవుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ఫిల్ సాల్ట్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వన్డే చరిత్రలోనే ఇది ఐదో అత్యంత వేగమైన హాఫ్ సెంచరీ. అతని ధాటికి ఇంగ్లండ్ 8 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్‌ను ధాటింది. పవర్ ప్లేలో 2 వికెట్లకు 107 పరుగులు చేసింది.

Story first published: Tuesday, September 26, 2023, 21:54 [IST]
Other articles published on Sep 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+