Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిషభ్ పంత్.. నువ్వు టీమిండియా ఫ్యూచర్.. మాజీ క్రికెటర్ల ప్రశంసలు!

ENG vs IND: Twitter Reacts As Rishabh Pant Hits His First Century In ODIs

న్యూఢిల్లీ: టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతని అసాధారణ బ్యాటింగ్‌కు మాజీ క్రికెటర్లు ఫిదా అయ్యారు. ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో అద్భుత శతకంతో రాణించి అందరినీ మెప్పించిన పంత్.. తాజాగా సిరీస్‌ నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో అజేయ శతకంతో మరోసారి టీమిండియాను ఆదుకున్నాడు.

ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో రిషభ్ పంత్(113 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 125 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

తొలి శతకంతో..

ఈ మ్యాచ్‌లో 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టల్లోపడ్డ భారత జట్టును రిషభ్ పంత్.. హార్దిక్ పాండ్యా(55 బంతుల్లో 10 ఫోర్లతో 71)తో కలిసి ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి వరకు నిలిచి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్నందించాడు. వన్డే కెరీర్‌లో తొలి శతకం నమోదు చేయడంతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు సొంతం చేసుకొన్నాడు.

పంత్‌ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లపై వారి సొంతగడ్డపైనే శతకాలు బాది గొప్ప బ్యాటర్‌గా పేరుపొందాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో పంత్‌ టీ20లు, వన్డేలకు పనికిరాడనే విమర్శలు వినిపించాయి.

కోచ్ అండతో..

ఇటీవల సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఘోరంగా విఫలం అయిన తరవాత పంత్‌పై మరిన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, కోచ్‌ ద్రవిడ్‌ మాత్రం పంత్‌కు మద్దతుగా నిలిచాడు. పంత్‌ సామర్థ్యం మాకు తెలిసని, భారత జట్టులో అతడు అంతర్భాగమని చెప్పాడు. గురువు ఆశించినట్లుగానే గొప్ప ఇన్నింగ్స్‌తో.. టీమిండియాలో తన ప్రాధాన్యం ఏంటో పంత్ విమర్శకులకు తన బ్యాట్‌తో సమాధానమిచ్చాడు.. మరోవైపు మాజీ క్రికెటర్లు పంత్ ఆట తీరును కొనియాడుతూ సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.

 సూపర్ డూపర్ ఫినిషర్..

సూపర్ డూపర్ ఫినిషర్..

టీమిండియా భవిష్యత్తు రిషభ్ పంతేనని, అతనో సూపర్ ఫినిషర్ అని సురేశ్ రైనా ట్వీట్ చేయగా.. తీవ్ర ఒత్తిడిలో రిషభ్ పంత్ చేసిన సెంచరీ గొప్పదని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రిషభ్ పంత్ గొప్ప ఆటగాడని, చాలా స్మార్ట్‌గా బ్యాటింగ్ చేశాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసించాడు. క్రికెట్ చరిత్రలోనే ఇది ఓ టాప్ సెంచరని, రిషభ్ పంత్ ఓ జెమ్ అని మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ ట్వీట్ చేశాడు.

Story first published: Monday, July 18, 2022, 15:58 [IST]
Other articles published on Jul 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+