
కోహ్లీసేనకు వరుణ గండం..
ఇక కోహ్లీసేనను వరణుడు ఓ గండంలా వెంటాడుతున్నాడు. ప్రతీసారి ప్రతికూల ఫలితాలకు కారణమవుతున్నాడు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో వర్షం ఆటకు అంతరాయం కలిగించడంతో భారత జట్టు రిజర్వ్ డే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కవర్లపై కప్పి ఉన్న పిచ్, చల్లని వాతావరణంతో న్యూజిలాండ్ స్వింగ్ బౌలర్లు చెలరేగారు. టాపార్డర్‌ను కుప్పకూల్చి ఇంటికి పంపించారు. ఇక గత నెలలో అదే న్యూజిలాండ్‌తో జరిగిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లోనూ వరణుడు కోహ్లీసేన కొంపముంచాడు. రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోగా.. తొలుత బౌలింగ్ చేసిన కివీస్‌కు పరిస్థితులు కలిసొచ్చాయి. దాంతో భారత జట్టు వర్షం కారణంగా మరోసారి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

సునాయసంగా గెలిచే మ్యాచ్..
తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పై చేయి సాధించే సువర్ణవకాశం వర్షం కారణంగానే చేజారింది. నాలుగు రోజుల పాటు విశ్రాంతి ఇచ్చి ఆటకు సహకరించిన వరుణుడు చివరి రోజు మాత్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దాంతో కోహ్లీసేనకు మరోసారి నిరాశే ఎదురైంది. 209 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ ఆట నిలిచే సమయానికి పావువంతు స్కోరు చేసేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ధాటిగా ఆడిన రాహుల్ (38 బంతుల్లో 26; 6 ఫోర్లు) నిష్క్రమించగా... రోహిత్ (12 బ్యాటింగ్), పుజారా (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆదివారం ఇంకా 157 పరుగులు చేస్తే భారత్ జయభేరి మోగిస్తుందని అంతా భావించారు. కానీ వరణుడు భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.

బౌలర్ల కష్టం గంగపాలు..
25/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జో రూట్ (172 బంతుల్లో 109; 14 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇతన్ని శతక్కొట్టిన తర్వాత ఔట్ చేసిన బుమ్రా (5/64) మిగతా టాపార్డర్‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్ చేర్చాడు. ఓపెనర్ సిబ్లీ (28; 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో క్రాలీ (6) సహా లోయర్ ఆర్డర్‌లో స్యామ్ కరన్ (45 బంతుల్లో 32; 4 ఫోర్లు), బ్రాడ్ (0)లను బుమ్రా ఔట్ చేశాడు. మరోవైపు శార్దుల్... లారెన్స్ (25), బట్లర్ (17) వికెట్లను పడేశాడు. దీంతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది. సిరాజ్‌కు 2 వికెట్లు దక్కాయి.

సంక్షిప్త స్కోర్లు:
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:183 ఆలౌట్; (జోరూట్ 64, బుమ్రా 4/46, మహ్మద్ షమీ 3/28)
భారత్ తొలి ఇన్నింగ్స్: 278 ఆలౌట్ (కేఎల్ రాహుల్ 84, జడేజా 56, రోహిత్ 36; బుమ్రా 28; రాబిన్‌సన్ 5/85, అండర్సన్ 4/54)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 303 ఆలౌట్ (జోరూట్(109).
భారత్ రెండో ఇన్నింగ్స్: 52/1


Click it and Unblock the Notifications












