Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs AUS: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. కోహ్లీ వరల్డ్ రికార్డ్ బద్దలు!

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న బ్రూక్.. ఆదివారం జరిగిన చివరి వన్డేలోనూ అదే జోరు కనబర్చాడు. 52 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. ఓపెనర్ బెన్ డక్కెట్(91 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 107)తో కలిసి నాలుగో వికెట్‌కు 132 పరుగులు జోడించాడు.

ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో హ్యారీ బ్రూక్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 5 వన్డేల్లో ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు బాదిన హ్యారీ బ్రూక్.. 312 రన్స్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును హ్యారీ బ్రూక్ అధిగమించాడు. 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ 310 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్‌గా ఉండగా.. తాజాగా హ్యారీ బ్రూక్ బద్దలు కొట్టాడు.

ENG vs AUS Harry Brook Creates History Breaks Massive Virat Kohli World Record

ఈ జాబితాలో హ్యారీ బ్రూక్(312), కోహ్లీ(310) తర్వాత ధోనీ(285), ఇయాన్ మోర్గాన్(278), బాబర్ ఆజామ్(276) ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి రెండు వన్డేలు ఓడి 0-2తో నిలవగా.. హ్యారీ బ్రూక్ సంచలన బ్యాటింగ్‌తో వరుసగా రెండు విజయాలు అందించాడు. మూడో వన్డేలో 110 పరుగులతో సత్తా చాటిన బ్రూక్.. 46 పరుగులతో ఇంగ్లండ్‌ను గెలిపించాడు.

నాలుగో వన్డేలో 58 బంతుల్లో 87 పరుగులు చేసి 186 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. చివరి వన్డేలో క్విక్ ఫైర్ నాక్‌తో భారీ స్కోర్ అందించాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 309 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా, గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండేసి వికెట్లు తీయగా.. ట్రావిస్ హెడ్ 4 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, September 29, 2024, 19:27 [IST]
Other articles published on Sep 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+