For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వైరల్ వీడియో.. ఒంటిచేత్తో ఒల్లీ పోప్‌ స్టన్నింగ్ క్యాచ్!!

ENG v sWI: Ollie Pope Takes One Of The Best Close-In Catches Ever Seen

మాంచెస్టర్‌: మాంచెస్టర్‌లో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చివరి రోజు విండీస్‌కు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్‌.. 198 పరుగులకే ఆలౌట్‌ చేసింది. షమర్‌ బ్రూక్స్‌ (136 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌ (88 బంతుల్లో 7 ఫోర్లతో 55) హాఫ్‌ సెంచరీలు చేశారు. స్టువర్ట్‌ బ్రాడ్‌ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్‌, బెన్ స్టోక్స్‌, డోమ్ బెస్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. బెన్‌ స్టోక్స్ ‌రెండు ఇన్నింగ్స్‌లలో ఆకట్టుకున్నాడు.

స్టన్నింగ్ క్యాచ్:

సోమవారం ఐదో రోజు ఇంగ్లండ్‌ జట్టు విజయానికి ఒక వికెట్‌ దూరంలో ఉంది. క్రీజులో విండీస్ ఆటగాళ్లు కీమర్‌ రోచ్, షనాన్ గాబ్రియేల్ ఉన్నారు. ఇద్దరు కలిసి నాలుగు ఓవర్ల పాటు వికెట్ కాపాడుకున్నారు. 71వ ఓవర్ వేసేందుకు స్పిన్నర్ డామ్‌ బెస్‌ బౌలింగ్‌కు వచ్చాడు. బెస్‌ మొదటి బంతిని వేయగా.. రోచ్ లెగ్ సైడ్ ఫ్లిక్ చేశాడు. గాల్లో లేచిన బంతిని ఒల్లీ పోప్‌ ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. తొలుత రెండు చేత్తుల్లో పడిన బంతి జారిపోగా.. అది మళ్లీ గాల్లోకి ఎగిరింది. అనంతరం దూరంగా పడుతున్న బంతిని పోప్‌ ముందుకు డైవ్‌ చేస్తూ అందుకున్నాడు. అలా చివరి వికెట్ క్యాచ్‌ పట్టి.. విండీస్‌ను ఓడించాడు.

సూపర్ మ్యాన్:

సూపర్ మ్యాన్:

ఒల్లీ పోప్ అద్భుత ఫీల్డింగ్ చేయడంతో పక్కనే ఉన్న క్రిస్ వోక్స్ , జోస్ బట్లర్ అతన్ని హత్తుకుని సంబరాలు చేసుకున్నారు. ఇక కెప్టెన్ జో రూట్.. ఒల్లీని ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుతం ఒల్లీ పోప్ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్రికెట్ అభిమానులు ఒల్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 'సూపర్ మ్యాన్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'వాట్ ఏ స్టన్నింగ్ క్యాచ్' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ:

ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ:

మ్యాచ్‌ విజయంలో బెన్ ‌స్టోక్స్‌ అద్భుత పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కీలక వికెట్లు కోల్పోయిన దశలో 255 బంతుల్లో సెంచరీ బాదాడు. మొత్తంగా 356 బంతుల్లో 176 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్టకాలంలో ఉన్న జట్టును ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా వచ్చి 36 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ ఓపెనర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఘన విజయం:

ఘన విజయం:

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ .. బెన్‌ స్టోక్స్ (176: 356 బంతుల్లో 17x4, 2x6), డొమినిక్ సిబ్లే (120: 372 బంతుల్లో 5x4) శతకాలు బాదడంతో మొదటి ఇన్నింగ్స్‌ని 469/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 287 పరుగులకి ఆలౌటవగా.. ఇంగ్లాండ్‌కి 182 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ‌స్టోక్స్ (78 నాటౌట్: 57 బంతుల్లో 4x4) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌ని 129/3తో డిక్లేర్‌ చేసిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 182 పరుగులు కలుపుకుని మొత్తం 312 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. లక్ష్య ఛేదనలో తడబడిన విండీస్ 198 పరుగులకే ఆలౌటైంది.

సొంత‌గ‌డ్డపై ఆస్ట్రేలియా పేసర్లు ప్ర‌భావం చూప‌కుంటే క‌ష్టం: బ్రెట్‌లీ

Story first published: Wednesday, July 22, 2020, 15:26 [IST]
Other articles published on Jul 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+