Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs CSK: ఐపీఎల్ చరిత్రలోనే ఇదే తొలిసారి!

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో గౌహతి వేదికగా జరుగుతున్న తమ తొలి మ్యాచ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఐపీఎల్ చరిత్రలోనే మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, రవీంద్ర జడేజా‌ల్లో కనీసం ఒక్కరు లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగడం ఇదే తొలిసారి. ధోనీ, రైనా ఆరంభం నుంచి సీఎస్‌కేతో ఉండగా.. జడేజా కాస్త ఆలస్యంగా జట్టులోకి వచ్చాడు. అయినా సీఎస్‌కే ఐకాన్‌గా ఎదిగాడు. ఈ త్రయం చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలబెట్టింది.

ధోనీ సారథ్యంలో సీఎస్‌కే‌ను 10 సార్లు ఫైనల్ చేరడంతో పాటు 12 సార్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. అతని సారథ్యంలో ఐదు టైటిళ్లను గెలిచింది. వికెట్ కీపర్‌గా 200 వికెట్లలో భాగమైన ధోనీ.. బ్యాటర్‌గా 5000 ప్లస్ రన్స్ చేశాడు. 'తల’గా ధోనీకి ప్రత్యేక అభిమాన గణం ఉంది. చిన్న తల సురేష్ రైనా ఐపీఎల్‌లో 5000 పరుగుల మైలురాయి అందుకున్న తొలి ఆటగాడు. మరోవైపు రవీంద్ర జడేజా.. ఐపీఎల్‌లో 100 పరుగులు, 100 వికెట్లతో పాటు 100 క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్లో బౌండరీతో విజయలాంఛనం పూర్తి చేయడం సీఎస్‌కే చరిత్రలోనే చిరస్మరణీయంగా మిగిలింది.

End of an Era CSK Plays First Match in 19 Years Without MS Dhoni Suresh Raina and Ravindra Jadeja

అలాంటి త్రయంలో ఒక్కరు లేకుండానే చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ప్రారంభించింది. సురేష్ రైనా 2022 సెప్టెంబర్‌లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా రవీంద్ర జడేజా.. రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లిపోయాడు. అతనికి బదులుగా సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ జట్టులోనే కొనసాగుతున్నా.. గాయం‌తో ఈ సీజన్ తొలి రెండు వారాలు టీమ్‌కు దూరమయ్యాడు. దాంతో ఐకాన్ ప్లేయర్లు లేకుండా చెన్నై బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇలా ధోనీ, రైనా, జడేజాల్లో ఒక్కరు కూడా లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగడం తమ 17 ఏళ్ల ప్రస్థానంలో ఇదే తొలిసారి.

Story first published: Monday, March 30, 2026, 20:59 [IST]
Other articles published on Mar 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+