Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Emerging Asia Cup 2023: సెమీస్ చేరిన భారత్.. పాకిస్థాన్‌తో ఢీ!

కొలంబో: ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) పురుషుల ఎమర్జింగ్‌ ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌-ఎ జట్టు దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. నేపాల్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌-బి మ్యాచ్‌లో భారత్-ఏ ఆటగాళ్లు సత్తా చాటారు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు.

దాంతో వరుసగా రెండు వన్డేల్లో గెలిచిన యంగ్ ఇండియా.. గ్రూప్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌.. భారత బౌలర్ల ధాటికి 39.2 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్‌ నిశాంత్‌ సింధు (4/14), పేసర్లు రాజ్యవర్ధన్‌ హంగార్గేకర్‌ (3/25), హర్షిత్‌ రాణా (2/16) అసాధారణ ప్రదర్శనతో నేపాల్ పతనాన్ని శాసించారు.

Emerging Asia Cup 2023: Abhishek Sharma, R Hangargekar Shine As India A beat Nepal A By 9 Wickets

నేపాల్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ పాడెల్‌ (85 బంతుల్లో 7 ఫోర్లతో 65) అర్ధశతకంతో ఒంటరి పోరాటం చేయగా.. గుల్షన్‌ జా (38) విలువైన పరుగులు చేశాడు. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌- ఎ అదరగొట్టింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అభిషేక్‌ శర్మ (69 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), సాయి సుదర్శన్‌ (52 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 58 నాటౌట్‌) అర్ధసెంచరీలతో సత్తాచాటారు.

ఈ ఓపెనింగ్‌ జోడీ తొలి వికెట్‌కు 19 ఓవర్లలోనే 139 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేసింది. అభిషేక్‌ ఔటైనా.. ధ్రువ్‌ జూరెల్‌ (12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21 నాటౌట్‌) వేగంగా ఆడి పని పూర్తిచేశాడు. అతను సిక్సర్‌తో మ్యాచ్‌ ముగించడం విశేషం. చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ బుధవారం పాకిస్థాన్‌-ఎతో తలపడుతుంది. సోమవారం యూఏఈ-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 184 పరుగుల తేడాతో గెలుపొందింది.

Story first published: Tuesday, July 18, 2023, 8:15 [IST]
Other articles published on Jul 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+