Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ అవార్డులు: 'ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌'గా పెర్రీ, 3వ స్ధానంలో హర్మన్

హైదరాబాద్: ఐసీసీ 2017కు గాను క్రికటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఆస్ట్రేలియాకు చెందిన ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ ఎగరేసుకుపోయింది. ఆస్ట్రేలియా మహిళా జట్టు రెండు సార్లు ప్రపంచ కప్ గెలుచుకున్న సందర్భాల్లోనూ టీంలో కీలక పాత్ర వహించింది.

ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ కొట్టిన షాట్ కు స్టేడియంలో

ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ కొట్టిన షాట్ కు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయమైంది. అయితే షాట్ కొట్టి అలానే వదిలేయలేదు. బంతి వెళ్తున్న దిశను గమనించిన ఎల్లిస్ పెర్రీ అది పడిన చోటును చూసి వెంటనే స్పందించింది. మ్యాచ్ మధ్యలో ఆపేసి గ్లౌజులతో సహా బ్యాట్ ను సైతం వదిలి స్టేడియం వైపుకు పరిగెత్తింది. వెంటనే అక్కడే అందుబాటులో ఉన్న వైద్యుణ్ని పిలిపించి ప్రథమ చికిత్స చేయించింది. చికిత్స జరిగేంత వరకు కదలలేక అక్కడే ఉండిపోయింది. అనంతరం మ్యాచ్‌కు వెళ్లి తిరిగి తన మ్యాచ్ ను కొనసాగించింది.

ఎల్లీస్ పెర్రీ కొట్టిన షాట్‌కు స్టేడియంలో వ్యక్తి తలపగిలింది :వీడియో

తన ప్రతిభను చాటింది

2017 నవంబరులో జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్‌లో సిడ్నీ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో పాల్గొన్న ఎలిస్ తన బౌలింగ్ మాయాజాలంతో మూడు వికెట్లు తీసింది. 213 పరుగులను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఆడిన 19 వన్డేల్లో 905పరుగులు, 22 వికెట్లను తీసింది.

చాలా చిన్న వయస్సులోనే..

తన 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా జట్టులోకి ఆరంగ్రేటం చేసింది. ఆ జట్టు మొత్తంలో ఆమే పిన్న వయస్కురాలు. ఈ అవార్డు గెలుచుకున్న ఆనందంలో ఎలిస్ తన ఆనందాన్ని ఇలా పంచుకుంది." 2017' సంవత్సరం నాకు చాలా స్పెషల్. నేను ఈ సంవత్సరం మహిళా క్రికెట్‌లో ఎన్నో మైలు రాళ్లను దాటాను. ఈ అవార్డును అందుకోవటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. టీం సహకారంతో నేను ఇన్ని చేయగలిగాను." అని వ్యక్తపరిచింది.

అవార్డు ఆవిడ పేరుతో ..

అవార్డు ఆవిడ పేరుతో ..

హెహోయ్ ఫ్లింట్ జ్ఞాపకార్థం ఈ అవార్డును 'రాచెల్ హెహోయ్ ఫ్లింట్ ' ఏటా ప్రదానం చేస్తారు. ఐసీసీ ముఖ్య కార్య నిర్వహణాధికారి డేవిడ్ రిచర్డ్ ‌సన్ " ఎలిస్ పెర్రీ ఈ 'రాచెల్ హెహోయ్ ఫ్లింట్ ' అవార్డుకు ఎంపికైనందుకు ఆనందంగా ఉంది. ఈ విధంగా హెహోయ్‌ను గుర్తు చేసుకుంటున్నాం. హెహోయ్ టీంను లీడ్ చేయడంలోనే కాదు. 1973 ప్రపంచ కప్‌లో మంచి ప్రతిభను ప్రదర్శించింది." అని కొనియాడారు.

హర్మన్ ప్రీత్ కు దక్కిన మూడో స్థానం:

హర్మన్ ప్రీత్ కు దక్కిన మూడో స్థానం:

ఇంకా టీ20 ఉమన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా బెత్ మూనీ, వన్డే ఉమన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా న్యూజిలాండ్‌కు చెందిన ఎమీ సత్తర్‌వైట్ గెలుచుకుంది. మహిళా వన్డే‌ల్లో భారత్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ కు మూడో స్థానం దక్కింది.

Story first published: Thursday, December 21, 2017, 14:26 [IST]
Other articles published on Dec 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+