
హైదరాబాద్: ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ కొట్టిన షాట్ కు స్టేడియంలో కూర్చొని మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి తలకు తీవ్ర గాయమైంది. అయితే షాట్ కొట్టి అలానే వదిలేయలేదు. బంతి వెళ్తున్న దిశను గమనించిన ఎల్లిస్ పెర్రీ అది పడిన చోటును చూసి వెంటనే స్పందించింది. మ్యాచ్ మధ్యలో ఆపేసి గ్లౌజులతో సహా బ్యాట్ ను సైతం వదిలి స్టేడియం వైపుకు పరిగెత్తింది.
వెంటనే అక్కడే అందుబాటులో ఉన్న వైద్యుణ్ని పిలిపించి ప్రథమ చికిత్స చేయించింది. చికిత్స జరిగేంత వరకు కదలలేక అక్కడే ఉండిపోయింది. అనంతరం మ్యాచ్‌కు వెళ్లి తిరిగి తన మ్యాచ్ ను కొనసాగించింది.
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు స్త్రీ హృదయం సున్నితం అని కొందరు అంటూంటే సామాజిక బాధ్యత నెరవేర్చింది. అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఎల్లిస్ పెర్రీ మహిళా విభాగంలో ఇటు క్రికెట్‌లోనూ అటు ఫుట్‌బాల్ లోనూ ఒకేసారి అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ లు ఆడిన వ్యక్తి. ఈ మధ్యనే జరిగిన మహిళా ఏషెస్ టెస్ట్ లో డబుల్ సెంచరీ చేసి సంచలనంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ తనదైన శైలీలో రాణిస్తున్న ఎలిక్ పెర్రీ ఫుట్‌బాల్ లో కూడా అదే స్థాయిలో రాణిస్తుండటం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.