ఎందుకో తెలుసా?: ఉదయం 5.30 గంటలకు గంగూలీ తలుపు తట్టిన సెహ్వాగ్

Posted By:
Eleven Gods And A Billion Indians Book: Did Sehwag Come Knocking On Gangulys Door At 5.30 Am?

హైదరాబాద్: టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉదయం 5.30 గంటలకు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రూమ్ తలుపుని కొట్టాడు. ఈ విషయాన్ని ముంబైలో జరిగిన 'ఎలెవన్ గాడ్స్ అండ్ ఎ బిలియన్ ఇండియన్స్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దాదా స్వయంగా వెల్లడించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

'శ్రీలంకతో ఫైనల్‌ ఓడిపోయిన మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు వీరేంద్ర సెహ్వాగ్‌ నాతో మాట్లాడేందుకు వచ్చాడు. నిద్రమత్తులో లేచి తలుపు తీశాను. ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడతాను అని చెప్పాను' అని తన జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

'2001లో ముక్కోణపు సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 121 పరుగుల తేడాతో భారత్‌ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో అనవసరపు షాట్‌కు యత్నించిన సెహ్వాగ్‌ రనౌట్‌‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాతి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో నా గది తలుపు తట్టాడు' అని దాదా తెలిపాడు.

'తిరిగి భారత్‌ వెళ్లే క్రమంలో కూడా నన్ను కలిసేందుకు వచ్చాడు. నాకు ఏమో అంత పొద్దున్నే సెహ్వాగ్‌తో మాట్లాడే మూడ్‌ లేదు. దీంతో తర్వాత పిలిచి మాట్లాడతా చెప్పాను. ఫైనల్ మ్యాచ్‌లో తన ఆటతీరుపై కెప్టెన్‌ సంతృప్తిగా లేడు.. ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని వచ్చాడు. కానీ, నేను మాట్లాడలేదు' అని గంగూలీ చెప్పాడు.

ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఐపీఎల్‌లో సెహ్వాగ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్నాడు. : ఏప్రిల్ 7న ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 5, 2018, 19:58 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి