Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ మీడియా రైట్స్.. 60 వేల కోట్లు! బీసీసీఐకి పైసలే పైసల్!

Elara Securities estimates IPL media rights value to soar 3-4 times to Rs 60000 crore

న్యూఢిల్లీ: ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి భారీ ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఐదేళ్లు(2023-28) మీడియా రైట్స్ ద్వారా రూ.50 వేల కోట్లు రాబట్టాలని అంచనా వేసిన బోర్డుకు బ్రోకరేజ్ సంస్థ ఎలారా సెక్యూరిటీస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 15 సూపర్ హిట్ కావడంతో మీడియా రైట్స్ ద్వారా రూ.50 వేల కోట్లు రాబట్టాలని అంచనా వేసిన బోర్డుకు బ్రోకరేజ్ సంస్థ ఎలారా సెక్యూరిటీస్ గుడ్ న్యూస్ చెప్పింది.

ఐపీఎల్ 15 సూపర్ హిట్ కావడంతో మీడియా రైట్స్‌కు భారీ ధర పలికే అవకాశం ఉందని స్పష్టం చేసింది. తద్వారా దాదాపు రూ.60 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా వేసింది. ప్రతీ మ్యాచ్‌కు ఐపీఎల్ డిజిటల్ బేస్‌ప్రైజ్ రూ.33 కోట్లుగా ఉంది. వేలంలో ఇది రూ.65 నుంచి రూ.66 కోట్ల మధ్య పలుకుతుందని అంచనా వేసింది. ఇక ప్రతీ మ్యాచ్‌కు ఐపీఎల్ బ్రాడ్‌కాస్ట్ బేస్ ప్రైజ్ రూ.49 కోట్లు కాగా, రూ.40 నుంచి 50 శాతం పెరుగుదల ఉండనుంది. దీంతో రూ.65 నుంచి 70 కోట్లు ఆదాయం రావొచ్చని ఎలారా చెబుతోంది.

టీవీ బ్రాడ్‌కాస్టర్‌కు ఏడాదిలో 6 శాతం వృద్ది ఉంటుందని అంచనా వేసిన ఎలారా.. వచ్చే ఐదేళ్లలో ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం డిజిటల్ రైట్స్‌లో 35 శాతం పెరుగుదల ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం డిస్నీ హాట్ స్టార్, సోనీ నెట్ వర్క్, వయాకామ్, రిలయన్స్ జీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, అమెజాన్, ఆపిల్, గూగుల్, బిడ్ డాక్యుమెంట్లను కొనుగోలు చేశాయి. జూన్ 12న ఉదయం 11 గంటలకు ఐపీఎల్ మీడియా హక్కుల కోసం ఈ-వేలం ప్రారంభం కానుంది.

Story first published: Wednesday, June 8, 2022, 12:43 [IST]
Other articles published on Jun 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+