Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ విజయం వారికి అంకితం: రజత్ పాటిదార్ భావోద్వేగం!

ఆర్‌సీబీ అభిమానులారా ఈ ఏడాది కూడా కప్పు మనదే అంటూ ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆర్‌సీబీకి కప్పు అందిస్తానని అస్సలు ఊహించలేదని, ఇదంతా ముందే రాసి పెట్టి ఉందన్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. వరుసగా రెండో టైటిల్ అందుకుంది.

ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసింది. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన రజత్ పాటిదార్ మాటలు రావడం లేదన్నాడు. తమ అభిమానులకు ఈ విజయం అంకితమని తెలిపాడు. గుజరాత్ టైటాన్స్ టాప్-3ని త్వరగా ఔట్ చేస్తే మ్యాచ్ గెలవచ్చని తమకు తెలుసని, ఆ ప్లాన్‌తో విజయం సాధించామని చెప్పాడు.

ఆ ముగ్గుర్ని ఔట్ చేస్తే..

'వరుసగా రెండో టైటిల్ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. గతేడాదికి సంబంధించిన ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ మేం ప్రస్తుత మ్యాచ్‌పైనే దృష్టి పెట్టాం. నా సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. చాలా ఆనందంగా ఉంది. మా ప్లాన్ చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఛేజింగ్ చేయడం సులువు అని తెలుసు. గుజరాత్ టాప్-త్రీ బ్యాటర్లను త్వరగా అవుట్ చేయాలనుకున్నాం. ఈ టోర్నీ అంతటా మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. భువి, హేజిల్‌వుడ్, రసిక్, కృనాల్, షెపర్డ్.. ఇలా అందరూ అద్భుత ప్రదర్శన చేశారు.

Ee Salanoo Cup Namdu Rajat Patidar Delights RCB Fans With a Historic Back-to-Back Title Victory Message

ముందేరాసి పెట్టి ఉంది..

నేను ఎప్పుడూ ఆర్‌సీబీకి కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ గెలుస్తానని ఊహించలేదు, అంతా ముందే రాసి పెట్టి ఉంది. గతేడాది మాపై చాలా ఒత్తిడి ఉంది. కానీ ఈ ఏడాది మేం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆటగాళ్లందరూ చాలా మంచి మైండ్ సెట్‌లో ఉన్నారు. అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడం చూడటానికి చాలా సంతోషంగా అనిపించింది, మేం ఎక్కడికి వెళ్లినా అది మా సొంత మైదానంలాగే అనిపించింది.

టోర్నీకి ముందు నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. ముఖ్యంగా నా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకున్నాను. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంపై ఫోకస్ పెట్టాను. ఈ విషయంలో దినేష్ కార్తీక్, విరాట్ కోహ్లీ భాయ్ సహాయం చేశారు. కోహ్లీ భాయ్ ఎప్పుడూ తోటి ఆటగాళ్లకు అండగా ఉంటాడు. తనతో మాట్లాడటానికి యువ ఆటగాళ్లు కాస్త ఇబ్బంది పడినా.. అతనే స్వయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడుతుంటాడు. ఆర్‌సిబీ అభిమానులారా.. 'ఈ సాలనూ కప్ నమ్దూ' (ఈ ఏడాది కూడా కప్పు మనదే!).'అంటూ రజత్ పాటిదార్ తన ప్రసంగాన్ని ముగించాడు.

Story first published: Monday, June 1, 2026, 7:03 [IST]
Other articles published on Jun 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+