Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫలించిన బీసీసీఐ మంత్రాంగం.. భారత క్రికెటర్లకు తప్పిన పెద్ద గండం!

ECB relaxes hard quarantine upon arrival of Indian cricketers in the UK After BCCI’s request

న్యూఢిల్లీ: ఇంగ్లండ్​ పర్యటన​కు బయలుదేరనున్న టీమిండియా పురుషుల, మహిళల​ క్రికెట్​ టీమ్​లకు పెద్ద గండం తప్పింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చేసిన మంత్రాంగం ఫలించడంతో క్రికెటర్లకు 10 రోజుల హార్డ్​ క్వారంటైన్‌ నుంచి ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మినహాయింపు ఇచ్చింది. భారత జట్లు మూడు రోజులు మాత్రమే క్వారంటైన్‌లో ఉండేందుకు ఓకే చెప్పింది.

ఈ మేరకు కరోనా ప్రొటోకాల్స్​ను సడలించింది. ఫలితంగా లండన్​లో దిగిన నాలుగో రోజు నుంచే భారత జట్లు ప్రాక్టీస్​ను మొదలుపెట్టనున్నాయి. జూన్​ 2న బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో యూకే బయలుదేరనున్న రెండు జట్లలో.. కోహ్లీ​సేన డైరెక్ట్​గా సౌతాంప్టన్ వెళ్తుంది. ఏజెస్​ బౌల్​ గ్రౌండ్​లో ఉన్న హోటల్లో మూడు రోజులు క్వారంటైన్​లో ఉంటుంది.

మహిళలకు సైతం..

మహిళలకు సైతం..

ఇక మహిళల జట్టు​.. బ్రిస్టల్​కు వెళ్తుంది. అక్కడ జూన్​ 16 నుంచి ఇంగ్లండ్​ మహిళల టీమ్​తో ఏకైక టెస్ట్​ మ్యాచ్​ ఆడుతుంది. ఇక ఇవే రూల్స్​ను క్రికెటర్ల ఫ్యామిలీకి కూడా వర్తింపజేయాలని బీసీసీఐ.. యూకే గవర్నమెంట్​ అధికారుల​ను కోరింది. అయితే ప్లేయర్ల వరకు పర్మిషన్​ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు​.. ఫ్యామిలీల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఈ విషయంపై భారత క్రికెట్ బోర్డు ఇంకా సంప్రదింపులు చేస్తోంది. ప్రస్తుతం క్రికెటర్లతో పాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్​ కూడా ముంబైలోని బబుల్​లోఉన్నారు. ఇక షెడ్యూల్ విషయానికొస్తే.. జూన్​ 18- 22 వరకు న్యూజిలాండ్​తో జరిగే వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్ అనంతరం ఆగస్టులో మొదలయ్యే సిరీస్​లో భారత్, ఇంగ్లండ్​తో ఐదు టెస్ట్​ మ్యాచ్​లు ఆడుతుంది.

నేడు టీమ్​ బబుల్లోకి ప్రసిధ్‌

నేడు టీమ్​ బబుల్లోకి ప్రసిధ్‌

ఇంగ్లండ్‌ టూర్‌కు స్టాండ్​ బై బౌలర్‌గా ఎంపికైన పేసర్‌ ప్రసిధ్ కృష్ణ.. నేడు మిగిలిన జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్‌-14లో భాగంగా కరోనా బారిన పడిన ప్రసిధ్‌ ఇటీవల రికవర్‌ అయ్యాడు. దీంతో ఆదివారం బెంగళూరు నుంచి బయలుదేరి ముంబైలో ఉన్న టీమ్​ బబుల్లోకి వెళ్లనున్నాడు. 'ప్రసిధ్​ కంప్లీట్​గా రికవర్​ అయ్యాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఇంట్లో ఉన్నాడు. ఆదివారం ముంబై బయలుదేరుతాడు. అక్కడి నుంచి టీమిండియా బబుల్లోకి వెళ్తాడు'అని ప్రసిధ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

భారత టెస్టు జట్టు

భారత టెస్టు జట్టు

విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుభమన్ గిల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్. ఇక కేఎల్ రాహుల్, సాహాలను ఫిట్‌నెస్‌ నిరూపించుకున్న తర్వాత ఎంపిక చేయనున్నారు.

స్టాండ్‌బై ప్లేయర్లు: అభిమన్యు ఈశ్వరన్, ప్రసీద్, అవేష్ ఖాన్, అర్జాన్ నాగ్వాస్వాల్లా.

Story first published: Sunday, May 23, 2021, 13:46 [IST]
Other articles published on May 23, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+