Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: కరోనా వైరస్ భయం.. బొక్కపడకుండా ఇంగ్లండ్ బోర్డు కఠిన చర్యలు!

ECB making strict bio-bubble plans for India vs England test series

లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ భయం ఇప్పుడు ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ)ని పట్టుకుంది. ఫస్ట్ వేవ్ టైమ్‌లో ప్రంపంచమే స్థంభించిపోయిన వేల ధైర్యంగా ముందడుగు వేసి బయో బుడుగలో తొలి క్రికెట్ సిరీస్ నిర్వహించిన ఈసీబీ.. ఇప్పుడు భయంతో వణికిపోతుంది. మరికొన్ని రోజుల్లో భారత జట్టుతో ఇంగ్లండ్‌ ఐదు టెస్టుల సిరీసులో ఆడాల్సి ఉంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ రెండో సీజన్‌కు ఇదే ఆరంభ సిరీస్. అంతేకాకుండా ఐదు టెస్ట్‌ల సిరీస్ కూడా ఇదే. ఇది రెండు జట్లకూ ప్రతిష్టాత్మకమే. భారత్ వేదికగా ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తుంటే.. సొంతగడ్డపై ఆ జట్టును ఓడించాలని కోహ్లీసేన పట్టుదలతో ఉంది.

అయితే శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీసు తర్వాత ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టును కరోనా వైరస్‌ వెంటాడింది. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయ సిబ్బందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో వెంటనే అందరినీ ఐసోలేషన్‌కు పంపించి చికిత్స అందిస్తోంది. పాక్‌తో సిరీసుకు బెన్‌స్టోక్స్‌ సారథ్యంలో కొత్త ఆటగాళ్లతో అప్పటికప్పుడు మరో జట్టును ఎంపిక చేసింది. ఈ అనుభవంతో ఇంగ్లండ్‌, భారత్‌ సిరీసును అత్యంత సురక్షితంగా, కఠిన బయో బుడగలో నిర్వహించాలని ఈసీబీ భావిస్తోంది.

ఎందుకంటే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ద్వారా ఈసీబీ దాదాపు 137 మిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించనుంది. మధ్యలో ఆటగాళ్లకు మరోసారి వైరస్‌ సోకితే సిరీస్‌ను పూర్తి చేయడం కష్టమవుతుంది. మళ్లీ నిర్వహించేందుకు సమయం కుదరదు. ఐపీఎల్‌ కోసం టీమిండియా క్రికెటర్లు యూఈకి వెళ్లాల్సి ఉంటుంది. పైగా కోట్లాది డాలర్ల నష్టం వాటిల్లుతోంది. రెండు జట్లకు రెండో డోసును సిరీసుకు ముందే వేయించాలని నిర్ణయించింది. ఏప్రిల్‌లో వైరస్‌ వల్ల ఐపీఎల్‌కు జరిగినట్టు తమకు ఇబ్బంది కలగొద్దని ఈసీబీ ముందస్తుగానే కఠిన చర్యలు తీసుకుంటోంది.

ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ జరగనుంది. ప్రస్తుతం భారత ఆటగాళ్లు విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. బ్రిటన్‌లోని పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

Story first published: Thursday, July 8, 2021, 19:22 [IST]
Other articles published on Jul 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+