వైస్ కెప్టెన్సీ ఏంది.. వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్ అవుతాడు: ఈస్ట్ జోన్ సెలెక్టర్స్
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన ఈస్ట్ జోన్ జట్టులో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. ఈ టోర్నీలో అతను ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఏంటని హర్షా భోగ్లే వంటి ప్రముఖ కామెంటేటర్లు తప్పుబట్టారు.
మహమ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న జట్టులో వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్సీని చేయడం సరికాదన్నాడు. ప్రతిభ పరంగా అతనికి లోటు లేదని, కానీ అతను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని హర్షా భోగ్లే చురకలంటించాడు. అయితే ఈ విమర్శలపై ఈస్ట్ జోన్ సెలెక్టర్స్ పరోక్షంగా స్పందించారు. ఏదో ఒక రోజు వైభవ్ సూర్యవంశీ భారత కెప్టెన్ అవుతాడని జోస్యం చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చామని వివరణ ఇచ్చారు.

వైభవ్ కోసమే ఈ నిర్ణయం..
'మేం కేవలం ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించడం లేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వైభవ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చాం. వైస్ కెప్టెన్‌గా వైభవ్.. కెప్టెన్‌ను దగ్గరగా గమనించి జట్టును ఎలా నడుపుతారనే విషయం తెలుసుకుంటాడు. అతను జట్టుతో మరింత మమేకం కావాలనే ఈ బాధ్యతలను అప్పజెప్పాం. ఇది అతని ఎదుగుదలకు సహాయపడుతుందని మేం భావిస్తున్నాం. అతను అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్. క్రమంగా పరిణతి చెందుతున్నాడు. అతనికి ఈ బాధ్యతను అప్పగించడం అతని ఎదుగుదలలో ఒక భాగం.
ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా.. వికెట్ కీపర్‌గా ఆటలోని ప్రతి దశలోనూ భాగమవుతాడు. వైస్ కెప్టెన్‌గా వైభవ్ అతనికి దగ్గరగా ఉండి అన్ని విషయాలు నేర్చుకుంటాడు. నాయకత్వాన్ని అర్థం చేసుకుంటాడు. అతను ఎదగాలని మేం కోరుకుంటున్నాం. ఏదో ఒక రోజు అతను కచ్చితంగా భారత జట్టుకు కెప్టెన్ అవుతాడు. అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం వెనుక ఉన్న ఆలోచన ఇదే.
అందుకే అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేయలేదు..
కెప్టెన్‌గా ఎంతో అనుభవం ఉన్న అభిమన్యు ఈశ్వరన్.. తన కంటే జూనియర్ అయిన ఇషాన్ కిషన్‌కు డిప్యూటీగా ఉండటం సరికాదని సెలెక్షన్ కమిటీ భావించింది. అందుకే అభిమన్యు ఈశ్వరన్‌కు వైస్ కెప్టెన్సీ ఇశ్వలేదు. 'అని ఈస్ట్ జోన్ సెలెక్టర్లలో ఒకరు ఈఎన్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు తెలిపారు.
2026 దులీప్ ట్రోఫీకి ఈస్ట్ జోన్ జట్టు
ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామీ, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుశాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రాంశు సేనాపతి, డానిష్ దాస్, అభిజిత్ సర్కార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

