Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Dwayne Bravo: యువరాజ్ సింగ్‌కు వేసిన ఆ బంతితో నా జీవితమే మారిపోయింది.. అదే నా ఫేవరేట్!

Dwayne Bravo says That Yuvraj magical delivery from 2006 changed my life

ముంబై: వెస్టిండీస్ దిగ్గజ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ డ్వేన్ బ్రావో ది బెస్ట్ టీ20 బౌలర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. విండీస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్ ఆడిన బ్రావో.. అటు బ్యాట్‌తో ఇటు బంతితో సత్తా చాటాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 152 మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 170 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా లసిత్ మలింగాతో సమంగా నిలిచాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఎంతో అనుభవం ఉన్న డ్వేన్ బ్రావో‌‌కు యువరాజ్ సింగ్‌కు వేసిన ఓ డిప్పర్ డెలవరీ ఫేవరేట్ అంట. ఆ బంతి తన జీవితాన్నే మార్చేసిందని, ప్రపంచం ముందు టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా నిలబెట్టిందని బ్రావోనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

యువీ ఔట్ చేసిన బంతి..

యువీ ఔట్ చేసిన బంతి..

ఐపీఎల్ 2022 సీజన్‌ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రావోనే ఫేవరేట్ బాల్ ఏదని ప్రశ్నించగా ఈ విషయం తెలిపాడు. 2006‌లో ఐదు వన్డేలు, నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ల కోసం వెస్టిండీస్ పర్యటనకు భారత్ జట్టు వెళ్లింది. వన్డే సిరీస్ 1-4తో కోల్పోయిన భారత్.. టెస్ట్ సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. అయితే ఈ పర్యటనలో రెండో వన్డేలో భారత్ గెలిచే మ్యాచ్‌లో 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. అది కూడా డ్వేన్ బ్రావో కారణంగానే. ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్‌ను ఔట్ చేసిన బంతే తన జీవితాన్ని మార్చేసిందని బ్రావో తెలిపాడు.

అయితే బ్రావో వికెట్ తీసే ముందే యువీ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దాంతో భారత్ విజయానికి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. కానీ ఆ ఓవర్ నాలుగో బంతికి యువీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ విజయం ముంగిట బొక్కబోర్లాపడింది.

ఏ బాల్ వేయాలో డిసైడ్ అవ్వలేదు..

ఏ బాల్ వేయాలో డిసైడ్ అవ్వలేదు..

'ఆ క్షణమే ఈ ప్రపంచం నన్ను గుర్తించింది. బంతులను వైవిధ్యంగా వేయడంలో దిట్ట అని నమ్మింది. ఆ విశ్వాసమే నా టీ 20 కెరీర్‌ను నిర్మించింది. అయితే యువీకి ఆ బంతి వేసే ముందు ఫీల్డ్ సెటప్ గురించి మా అప్పటి కెప్టెన్ బ్రియాన్ లారా మాట్లాడాడు. కానీ నా రన్నప్ మొదలుపెట్టేవరకు ఏం బంతి వేయాలో నేను డిసైడ్ అవ్వలేదు. నా రన్నప్ అంపైర్‌కు సమీపిస్తుండగా డిప్పర్ వేయాలనుకున్నా. దాన్ని అర్థం చేసుకోలేకపోయి యువీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలాంటి బాల్స్ చాలానే ఉన్నాయి. కానీ ఒక్కటి ఎంచుకోమంటే మాత్రం ఆ యువ రాజ్ బాల్ నా ఫేవరేట్. అది నా జీవితాన్నే మార్చేసింది.'అని బ్రావో చెప్పుకొచ్చాడు.

చరిత్రకు చేరువలో బ్రావో..

చరిత్రకు చేరువలో బ్రావో..

ఇక డ్వేన్‌ బ్రావో ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు వికెట్‌ దూరంలో నిలిచాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మరికొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో బ్రావో మరో వికెట్ తీస్తే.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌ మాజీ బౌలర్‌ లసిత్‌ మలింగ (170) రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం బ్రావో 170 వికెట్లతో మలింగతో సమానంగా ఐపీఎల్‌ హైయ్యెస్ట్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌ టాప్‌ 6 వికెట్‌ టేకర్స్‌ జాబితాలో మలింగ, బ్రావోల తరువాత అమిత్‌ మిశ్రా (166), పియుష్‌ చావ్లా (157), హర్భజన్‌ సింగ్‌ (150), రవిచంద్రన్ అశ్విన్ (145) ఉన్నారు.

లక్నోతో అమీ తుమీ..

లక్నోతో అమీ తుమీ..

రవీంద్ర జడేజా నేతృత్వంలో సీఎస్‌కే .. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. చెన్నై.. కాన్వే స్థానంలో మొయిన్‌ అలీని ఆడించే ఛాన్స్‌ ఉండగా, లక్నో.. మొహ్సిన్‌ ఖాన్‌ బదులు కృష్ణప్ప గౌతమ్‌, షాబజ్‌ నదీమ్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమిపాలైనప్పటికీ వెటరన్‌ ఆటగాళ్లు బ్రావో (3/20), ధోని (50 నాటౌట్‌) రాణించడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Story first published: Thursday, March 31, 2022, 16:37 [IST]
Other articles published on Mar 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+