Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్‌లో అతిపెద్ద సూపర్‌స్టార్‌ ధోనీనే: విండీస్ మాజీ కెప్టెన్

Dwayne Bravo said MS Dhoni the Biggest Superstar in Cricket

ఆంటిగ్వా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్)లో 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు తరఫున ఆడుతున్న వెస్టిండీస్ ఆల్‌రౌండర్, మాజీ కెప్టెన్‌ డ్వేన్ బ్రావో.. ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌లో అతిపెద్ద సూపర్‌స్టార్‌‌ ధోనీనే అని‌ బ్రావో పేర్కొన్నాడు. ఆటగాళ్లందరూ అతనితో ఎక్కువ చనువుగా ఉండొచ్చని తెలిపాడు. ఇప్పటి వరకు సీఎస్‌కే తరఫున 104 మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 121 వికెట్స్‌ పడగొట్టాడు.

అతిపెద్ద సూపర్‌స్టార్‌‌ ధోనీ:

అతిపెద్ద సూపర్‌స్టార్‌‌ ధోనీ:

జింబాబ్వే మాజీ పేసర్‌ పోమీ మబాంగ్వాతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో డ్వేన్ బ్రావో మాట్లాడుతూ... 'క్రికెట్‌, మా జట్టులో అతిపెద్ద సూపర్‌స్టార్‌‌ ధోనీ. క్రికెట్ మైదానం వెలుపల సంభాషించడానికి సులభమైన వ్యక్తులలో మహీ ఒకడు. ధోనీ వీడియో గేమ్స్ ఆడటం ఇష్టపడుతాడు. ఎప్పుడు అతనితో మాట్లాడాలనిపించినా వెళ్లి కలువొచ్చు. అతడిని కలిసేందుకు రూం డోర్స్‌ ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అతిపెద్ద సూపర్ స్టార్ గురించి మాట్లాడినప్పుడల్లా.. ధోనీ కచ్చితంగా గుర్తుకువస్తాడు' అని అన్నాడు.

సీఎస్‌కే జైత్రయాత్రలో ధోనీ పాత్ర కీలకం:

సీఎస్‌కే జైత్రయాత్రలో ధోనీ పాత్ర కీలకం:

బ్రావో ఇంకా మాట్లాడుతూ సీఎస్‌కేతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు. 'ఐపీఎల్‌లో సీఎస్‌కే జైత్రయాత్రలో ధోనీతో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ పాత్ర కీలకం. జట్టు యాజమాన్యం వారిద్దరినీ విశ్వసించింది. వారు కూడా ఓనర్స్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సీఎస్‌కే ఒక ప్రత్యేక జట్టు. మాకు చాలా నమ్మకమైన అభిమానులు ఉన్నారు. వారి మద్దతు ఎప్పటికీ మరువను. బ్రావో వెస్టిండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టీ20ళ్లు ఆడాడు.

 ధోనీ, ఫ్లెమింగ్‌ మద్దతు మరువలేనిది:

ధోనీ, ఫ్లెమింగ్‌ మద్దతు మరువలేనిది:

ఎంఎస్ ధోనీకి, స్టీఫెన్ ఫ్లెమింగ్‌కి తనపై ఎంతో నమ్మకం ఉంటుందని బ్రావో పేర్కొన్నాడు. 'ధోనీ, ఫ్లెమింగ్‌ ఎప్పుడూ నాకు మద్దతుగా ఉంటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్‌ చేసి బాగా పరుగులు ఇచ్చినా లేక సాధారణంగా పరుగులు ఇచ్చినా.. వాళ్లు నాతో ఒకే విధంగా ఉంటారు. కొన్ని సార్లు విఫ‌ల‌మైనా డెత్ ఓవ‌ర్ల‌లో బౌలింగ్ చేసే చాన్స్ ఇచ్చారు. డెత్ ఓవర్లలో నా ప్రతిభను సీఎస్‌కే వెలికి తీసింది. బలమైన ఆటగాళ్లకి వ్యతిరేకంగా ఆడటం అంత సులభం కాదు. కానీ నేను నా ప్రతిభని నమ్ముకొని ఉంటాను' అని బ్రావో పేర్కొన్నాడు.

రిటైర్మెంట్‌ వెనక్కు:

రిటైర్మెంట్‌ వెనక్కు:

2011 నుంచి సీఎస్‌కే తరఫున ఆడిన బ్రావో.. 104 మ్యాచుల్లో 121 వికెట్లు తీశాడు. అంతేకాక 2013, 2015 సీజన్లలో అత్యధిక వికెట్లు తీసి 'పర్పుల్ క్యాప్‌'ని కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఏడాది తర్వాత బ్రేవో తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. బ్రేవో 2018 అక్టోబర్‌లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 2012, 2016ల్లో విండీస్‌ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో సభ్యుడు. విండీస్‌ క్రికెట్‌ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేసి రిటైర్మెంట్‌ ఇచ్చాడు.

100 వసంతాలు పూర్తి చేసుకున్న భారత మాజీ క్రికెటర్ మృతి!!

Story first published: Saturday, June 13, 2020, 12:30 [IST]
Other articles published on Jun 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+