For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్పెషల్ బర్త్ డే గిప్ట్.. 'ఎంఎస్ ధోనీ నెంబర్ 7' సాంగ్ రిలీజ్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!!

Dwayne Bravo releases Number 7 song dedicated to MS Dhoni on the eve of former captains 39th birthday

హైదరాబాద్: మ్యాచ్‌లో ఉత్కంఠను తారా స్థాయికి తీసుకెళ్లి ఆఖరి బంతి వరకు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టి చివరకు భారీ షాట్‌తో గెలిపించడం క్రికెట్ ప్రపంచంలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక్కడికే చెల్లింది. భారత్‌కి 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించి.. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా మహీ రికార్డుల్లోకెక్కాడు. ఒకటా రెండా అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్‌ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా.. సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అతనికే చెల్లింది.

స్పెషల్ బర్త్ డే గిప్ట్:

స్పెషల్ బర్త్ డే గిప్ట్:

ఝార్ఖండ్‌లోని రాంచీలో 1981, జులై 7న ఎంఎస్ ధోనీ జన్మించాడు. మహీ మంగళవారం 39వ పడిలోకి అడుగుపెట్టాడు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో ఓ స్పెషల్ సాంగ్‌ని రూపొందించాడు. ధోనీ ఘనతలు, గొప్పతనాన్ని కీర్తిస్తూ 'ఎంఎస్ ధోనీ నెంబర్ 7​' పేరిట బ్రావో ఆ పాటను ఈ రోజు రిలీజ్ చేసాడు. దీంతో మహీపై ఉన్న ప్రేమను బ్రావో చాటుకున్నాడు.

ఘనతల్ని ప్రస్తావిస్తూ సాంగ్:

చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఎంఎస్ ధోనీ, డ్వేన్‌ బ్రావో చాలాకాలంగా కలిసి ఆడుతున్న విషయం తెలిసిందే. ధోనీని తన సోదరుడిగా అభివర్ణించిన బ్రావో.. ధోనీ కెరీర్ ఆరంభం నుంచి సాధించిన ఘనతల్ని ప్రస్తావిస్తూ పాటని రూపొందించి ఆయనకు అంకితం ఇచ్చాడు. ధోనీ క్రికెట్ కెరీర్‌ని 3.30 నిమిషాల వీడియోలో అభిమానులు ముందుంచి ఔరా అనిపించాడు. వీడియోలో మహీ ధరించే జెర్సీ నెం.7తో పాటు హెలికాప్టర్ షాట్, తలా, ఛాంపియన్ పేర్లని బ్రావో వాడాడు. అంతేకాదు మైదానంలో పిల్లలు, శునకాలతో ఆడడం కూడా చూపించాడు. అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇవ్వడం, పిచ్ పరిశీలించడం, ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం, ప్రాక్టీస్ ఇలా అన్నీ చూడొచ్చు.

మహీ అభిమానులకు పండగ:

మహీ అభిమానులకు పండగ:

'మహీ.. మహీ.. మహీ.. తలా.. తలా.. తలా.. ఎంఎస్ ధోనీ నం7.. ఎంఎస్ ధోనీ నం7..' అంటూ సాంగ్ ప్రారంభం అయింది. 'ఇతగాడు రాంచీ నుంచి వచ్చాడు.. అతడే ఎంఎస్ ధోనీ' అని డ్వేన్‌ బ్రావో పాడాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌.. 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ.. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథి అని కూడా పాటలో చెప్పాడు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

నెల రోజుల ముందు నుంచే సందడి:

నెల రోజుల ముందు నుంచే సందడి:

ఎంఎస్ ధోనీ జన్మదిన వేడుకలకు నెల రోజుల ముందు నుంచే డ్వేన్‌ బ్రావో సంబరాలు మొదలుపెట్టాడు. ఎందుకంటే.. బ్రావోకి ధోనీ అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు వీరిద్దరి మధ్య విడదీయరాని స్నేహబంధం ఉంది. ఎంతలా అంటే.. ఒకసారి మైదానంలోనే ధోనీ కాలర్‌ని సరదాగా బ్రావో పట్టుకునేంతలా. చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఈ ద్వయం ఎన్నో అద్భుతాలు చేసింది. అందుకే ఈ పుట్టిన రోజుకు పాటను మహీకి బ్రావో అంకితమిచ్చాడు. బ్రావో అద్భుతమైన గాయకుడు. అంతకుమించి మంచి డాన్సర్‌. తానే స్వయంగా పాటలు రాసి వీడియోలు చేస్తాడు. బ్రావో వెస్టిండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టీ20లు ఆడాడు.

 మహీ కోసం ఏదైనా చేయాలనిపించింది:

మహీ కోసం ఏదైనా చేయాలనిపించింది:

బ్రావో గతంలో ఓసారి మాట్లాడుతూ ధోనీ కోసం ఏదైనా కొత్తగా చేయాలని ఉందన్నాడు. మహీ ఎంతో మంది ఆటగాళ్లకు అవకాశాలిచ్చాడని, అందుకే అతడిపై ఓ పాట రాస్తున్నానన్నాడు. ఇలా ఏ క్రీడాకారుడిపైనా ఎవరూ పాటతో తమ అభిమానాన్ని చాటలేదని, తానే కొత్త ఆలోచనలతో వచ్చానని తెలిపాడు. 'ధోనీ కెరీర్‌ తుది ఘట్టానికి చేరింది. అతడి కోసం ఏదైనా చేయాలని అనిపించింది. అతడి కెరీర్‌ మొత్తం అద్భుతంగా సాగింది. నా వ్యక్తిగత కెరీర్‌పైనా చాలా ప్రభావం చూపాడు. అలాగే ఎంతో మంది ఆటగాళ్లకు వెన్నుదన్నుగా నిలిచాడు. దేశం కూడా గర్వపడేలా కప్పులు సాధించాడు. అందుకే అతడి కోసం ఏదైనా చేయాలనిపించింది. అందుకే ఈ పాట రాస్తున్నా' అని బ్రావో వివరించాడు.

మరో ముగ్గురు పాక్‌ క్రికెటర్లకు కరోనా నెగిటివ్.. రేపు ఇంగ్లండ్‌కు పయనం!!

Story first published: Tuesday, July 7, 2020, 9:38 [IST]
Other articles published on Jul 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+