Dwayne Bravo: చరిత్ర సృష్టించిన సీఎస్‌కే ఆల్‌రౌండర్!

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డుకెక్కాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ది హండ్రెడ్ టోర్నీలో బ్రావో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ టోర్నీలో నార్తన్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో.. గురువారం ఇన్‌విసిబుల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా టీ20ల్లో 600 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.

తొలి బౌలర్‌గా..
సామ్ కరన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బ్రావో .. ఆ ఆనందాన్ని తనదైన శైలిలో ఆస్వాదించాడు. వినూత్న ఎక్స్‌ప్రెషన్స్‌తో బాడీని షేక్ చేస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20ల్లో 516 ఇన్నింగ్స్‌లు ఆడి ఈ ఘనత అందుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఓవరాల్‌గా 20 బంతులేసి 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా బ్రావో తర్వాత అఫ్గానిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 466 వికెట్లు, విండీస్‌కు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

బ్రావో టీమ్‌కు తప్పని ఓటమి..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్ చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆడమ్ లిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. లిత్ మినహా మిగతావారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్‌విసిబుల్స్ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సామ కరన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోర్డాన్ కాక్స్ 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో టామ్ కరన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.


17 ఏళ్ల పాటు..
2004 నుంచి 2021 వరుకు వెస్టిండీస్ క్రికెట్‌కు ఆల్‌రౌండర్‌గా సేవలందించిన బ్రావో.. 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఓవరాల్‌గా విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన బ్రావో టీ20 ప్రపంచకప్ 2021 కోసం రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications