Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020: సన్‌రైజర్స్‌కు సపోర్ట్‌గా తెలంగాణ సర్కార్.. దుర్గం చెరువు బ్రిడ్జి ఆరెంజ్ మయం!

Durgam cheruvu cable bridge lighten up in orange colour ahead DC vs SRH qualifier 2

హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. పడుతూలేస్తూ ముందుకు సాగిన ఆరెంజ్ ఆర్మీ.. సరైన టైమ్‌‌లో పుంజుకొని టైటిల్ రేసులో నిలిచింది. ఇక టాప్‌‌ గేర్‌‌లో టోర్నీని స్టార్ట్‌‌ చేసి చివర్లో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో నేడు జరిగే క్వాలిఫయర్‌‌-2లో అమీతుమీ తేల్చుకోనుంది.

ఐపీఎల్ 2020లో చివరి మూడు లీగ్ మ్యాచ్‌ల్లో గెలిచి ప్లేఆఫ్ చేరిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించింది. బెంగళూరుపై సన్‌రైజర్స్ విజయం సాధించగానే.. తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేశారు. మరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి టైటిల్ తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

అంతేకాకుండా తెలంగాణ సర్కార్ హైదరాబాద్ టీమ్‌కు మద్దతుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ఆరెంజ్ మయం చేసింది. శనివారం నుంచి ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆరెంజ్ కలర్‌ లైటింగ్‌‌ను, సన్‌రైజర్స్ డిజిటల్ లోగోను ఉంచి వార్నర్ సేనకు సపోర్ట్ ఇచ్చింది. ఈ ఫొటోలను తెలంగాణ అర్బన్ డెవలప్‌మెంట్ సెక్రటరీ అరవింద్ కుమార్ ట్వీట్ చేయగా.. మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు ముందు హైదరాబాద్ ప్రజల తరఫున అరవింద్ కుమార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఢిల్లీపై సన్‌రైజర్స్ గెలవాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

Story first published: Sunday, November 8, 2020, 13:40 [IST]
Other articles published on Nov 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+