For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy మన సౌత్ జోన్‌దే.. వెస్ట్‌జోన్‌పై రివేంజ్ తీర్చుకున్న విహారి సేన!

బెంగళూరు: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మన సౌత్ జోన్ సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో తెలుగు క్రికెటర్ హనుమ మిహారి సారథ్యంలోని సౌత్ జోన్ టీమ్ 75 పరుగుల తేడాతో వెస్ట్ జోన్‌ను ఓడించింది. 298 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 182/5తో చివరి రోజు, రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్ట్‌ జోన్.. 222 పరుగులకే కుప్పకూలింది.

లెఫ్టార్మ్ స్పిన్నర్‌ సాయి కిశోర్‌ (4/57), వాసుకి కౌశిక్‌ (4/36) సూపర్ బౌలింగ్‌తో వెస్ట్‌ జోన్ పతనాన్ని శాసించారు. సౌత్‌ జోన్‌కు ఇది 14వ దులీప్‌ ట్రోఫీ టైటిల్‌ కావడం విశేషం. గతేడాది ఫైనల్లో వెస్ట్‌ జోన్ చేతిలో ఎదురైన ఓటమికి సౌత్ జోన్ ప్రతీకారం తీర్చుకుంది.

Duleep Trophy: South Zone beat West Zone by 75 runs to win tittle

ప్రియాంక్‌ పాంచల్‌ (95) సూపర్ బ్యాటింగ్‌తో హోరా హోరీగా మారిన ఈ పోరు చివరకు ఏకపక్షంగా మారింది. చివరి రోజు ఆటలో ప్రియాంక్ పాంచల్
ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరుకు కేవలం మూడు పరుగులే జోడించి వెనుదిరిగడం ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది. విద్వత్‌ కావేరప్ప బౌలింగ్‌లో అతను ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ రికీ భుయ్‌కి చిక్కాడు.

మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ అతిత్‌ సేత్‌ (9) కూడా త్వరగానే ఔటయ్యాడు. సాయికిశోర్‌ అతణ్ని వెనక్కి పంపాడు. ఆ తర్వాత వెస్ట్‌ పరాజయం కేవలం లాంఛనమే. తొలి ఇన్నింగ్స్‌లో సౌత్‌జోన్‌ 213 పరుగులు చేయగా.. వెస్ట్‌ 146 పరుగులకే కుప్పకూలింది. సౌత్‌జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన విద్వత్‌ కావేరప్ప 'ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌', 'ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డులను అందుకున్నాడు.

సౌత్ జోన్ విజయంలో హనుమ విహారి కూడా కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 63, రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగులతో సత్తా చాటాడు.

సంక్షిప్త స్కోర్లు..

సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 213 ఆలౌట్( హనుమ విహారి 63, తిలక్ వర్మ 40, షామ్స్ ములానీ3/29)

వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 146 ఆలౌట్(పృథ్వీ షా 65, విద్వత్ కావేరప్ప 7/53)

సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్: 230 ఆలౌట్(హనుమ విహారి 42, వాషింగ్టన్ సుందర్ 37, రికీ భూయ్ 37, జడేజా 5/40)

వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్: 222 ఆలౌట్( ప్రియాంక్ పాంచల్ 95, సర్ఫరాజ్ ఖాన్ 48, సాయి కిశోర్‌ (4/57), వాసుకి కౌశిక్‌ (4/36))

Story first published: Monday, July 17, 2023, 7:57 [IST]
Other articles published on Jul 17, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+