Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy: విహారీ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారీ లక్ష్యం దిశగా సౌత్ జోన్!

బెంగళూరు: దులీప్ ట్రోఫీ‌లో భాగంగా వెస్ట్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ పట్టు బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(10 బ్యాటింగ్)తో పాటు విజయ్‌కుమార్ వైశాఖ్(1) ఉన్నాడు. ప్రస్తుతం సౌత్ జోన్ ఆధిక్యం 248 పరుగులకు చేరింది.

అంతకుముందు 129/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్ట్ జోన్ 146 పరుగులకు కుప్పకూలింది. 17 పరుగుల వ్యవధిలోనే వెస్ట్ జోన్ చివరి మూడు వికెట్లు కోల్పోయింది. సౌత్ జోన్ బౌలర్ విద్వత్ కావెరప్ప(7/53) ఏడు వికెట్లతో వెస్ట్ జోన్ పతనాన్ని శాసించించాడు. విజయ్ కుమార్ వైశాఖ్‌ రెండు వికెట్లు తీయగా.. వాసుకి కౌశిక్ ఓ వికెట్ పడగొట్టాడు.

Duleep Trophy: South Zone 181/7, leads by 248 runs at stumps

వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా మినహా అంతా విఫలమయ్యారు. దాంతో సౌత్ జోన్‌కు 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ ఆదిలోనే ఓపెనర్ రవికుమార్(5), ఫస్ట్ డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ(3) కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో హనుమ విహారి(42), మయాంక్ అగర్వాల్(35) జట్టును ఆదుకున్నారు.

మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించిన అనంతరం మయాంక్ అగర్వాల్ ఔటవ్వగా.. హనుమ విహారి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా ఔటవ్వడంతో సౌత్ జోన్ 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రికీ భూయ్(37), సచిన్ బేబీ(28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు.

బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై 280 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే సౌత్ జోన్‌ గెలిచే అవకాశం లభిస్తోంది.

Story first published: Friday, July 14, 2023, 22:40 [IST]
Other articles published on Jul 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+