Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy Final: సౌత్ జోన్ తడ ‘బ్యాట్’.. ఆదుకున్న తెలుగు తేజాలు!

బెంగళూరు: ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్ బ్యాటర్లు తడబడ్డారు. వెస్ట్ జోన్‌తో బుధవారమే ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 65 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్(9 బ్యాటింగ్), విజయ్‌కుమార్ వైశాఖ్(5 బ్యాటింగ్) ఉన్నారు.

వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ షేత్ ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్‌కు వెస్ట్ జోన్ బౌలర్లు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చారు. తొలి సెషన్‌లోనే ఓపెనర్లు రవికుమార్ సమర్థ్(7), మయాంక్ అగర్వాల్(28)లను పెవిలియన్ చేర్చారు.

Duleep Trophy Final

ఈ పరిస్థితుల్లో తెలుగు తేజాలు హనుమ విహారి(130బంతుల్లో 9 ఫోర్లతో 63), తిలక్ వర్మ(87 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 40) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 79 పరుగులు జోడించిన అనంతరం తిలక్ వర్మ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. హనుమ విహారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా మరోవైపు వెస్ట్ జోన్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలో 103 బంతుల్లో విహారి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక విహారికి ఇది 46వ ఫస్ట్ క్లాస్ హాఫ్ సెంచరీ. అనంతరం కూడా ఆచితూచి ఆడిన హనుమ విహారిని ములాని క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో విహారి 6వ వికెట్‌గా వెనుదిరిగాడు.

అనంతరం సాయి కిషోర్ కూడా ఔటవ్వగా.. వాషింగ్టన్ సుందర్, విజయ్ కుమార్ వైశాక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు. బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముందుగా ముగించారు. వెలుతురు లేమి కారణంగా దాదాపు 25 ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. ఆట పూర్తిగా జరిగి ఉంటే సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసేది.

తెలుగు తేజాలు హనుమ విహారీ, తిలక వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడకున్నా.. సౌత్ జోన్ పరిస్థితి దారుణంగా ఉండేది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం కీలకం. మ్యాచ్ డ్రా ముగిస్తే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు.

Story first published: Wednesday, July 12, 2023, 17:59 [IST]
Other articles published on Jul 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+