Duleep Trophy: అభిషేక్ శర్మకు నో ఛాన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం!
ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026 కోసం నార్త్ జోన్ టీమ్‌ను సెలెక్టర్లు ప్రకటించారు. జమ్మూకశ్మీర్ కెప్టెన్ కన్హయ్య వాధ్వాన్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను సోమవారం వెల్లడించారు. ఢిల్లీ ప్లేయర్ ఆయుష్ బదోనిని వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీమిండియా బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు అన్షుల్ కాంబోజ్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.
అర్ష్‌దీప్ సింగ్‌ను టెస్ట్ ఫార్మాట్‌కు సిద్దం చేయాలనే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు అర్థమవుతోంది. జస్‌ప్రీత్ బుమ్రా గాయాల నేపథ్యంలో అర్ష్‌దీప్ సింగ్‌ను అతనికి బ్యాకప్‌గా రెడీ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాది తర్వాత అర్ష్‌దీప్ సింగ్ రెడ్ బాల్ ఫార్మాట్ ఆడనున్నాడు.

టీమిండియా టీ20 స్టార్ అభిషేక్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అతనితో పాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లకు అవకాశం కల్పించలేదు. వైట్ బాల్ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఈ ఇద్దర్నీ రెడ్ బాల్ ఫార్మాట్‌కు పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
ఆగస్ట్ 23 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. అదే సమయంలో శ్రీలంకతో భారత్ రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. దాంతోనే దులీప్ ట్రోఫీకి టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు అకిబ్ నబీని దూరంగా ఉంచారు. కొత్తగా నార్త్ జోన్ సారథ్య బాధ్యతలు అందుకున్న 24 ఏళ్ల కన్హయ్య వాధ్వాన్.. జమ్ముకశ్మీర్ 2025-26 రంజీ ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 474 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కీలకమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ ఛాంపియన్ టీమ్ అయిన జమ్మూ కశ్మీర్ నుంచి ఆరుగురు ఆటగాళ్లకు నార్త్ జోన్ టీమ్‌లో చోటు దక్కడం గమనార్హం.
దులీప్ ట్రోఫీ నార్త్ జోన్ టీమ్:
సనత్ సాంగ్వాన్, కమ్రాన్ ఇక్బాల్, యశ్ ధుల్, ఆయుష్ దోసెజా, అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని(వైస్ కెప్టెన్), కన్హయ్య వాధ్వాన్(కెప్టెన్), నిశాంత్ సింధు, అర్షున్ శర్మ, అబిద్ ముస్తాక్, అర్ష్‌దీప్ సింగ్, సునీల్ కుమార్, అన్షుల్ కాంబోజ్, యుధ్వీర్ సింగ్, నిఖిల్ కశ్యప్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

