Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4 బంతుల్లో 2 వికెట్లు.. బౌలింగ్‌లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ!

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కళ్లు చెదిరే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తద్వారా తనకు బౌలింగ్ చేసే సత్తా కూడా ఉందని ఈ సిక్సర పిడుగు చాటి చెప్పాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న తొలి రౌండ్ మ్యాచ్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆశ్చర్యపరిచాడు.

అందుకే ఆ రోజు యశస్వి జైస్వాల్‌ను బయటకు పంపించాను: రహానే

అందుకే ఆ రోజు యశస్వి జైస్వాల్‌ను బయటకు పంపించాను: రహానే

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ(6 బంతుల్లో 8).. బౌలింగ్‌లో మాత్రం 4 బంతుల్లోనే 2 వికెట్లు తీసాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అవాక్కవుతున్నారు. బుడ్డోడు బౌలింగ్ కూడా చేస్తాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Duleep Trophy 2026 Vaibhav Sooryavanshi Shines With 2 Wickets in 4 Balls vs North East Zone Video Goes Viral

4 బంతుల్లో 2 వికెట్లు..

నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్ బౌలింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. రెండో బంతికి కిషన్ లింగ్డో(24)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన ఇమ్లివాటి లెమ్తుర్(4)ను కూడా కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. 4 బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. స్పిన్ బౌలింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 3.66 ఎకానమీతో 2 వికెట్లు పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌ను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ 112.5 ఓవర్లలో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. సుదీప్ కుమార్ ఘరమి(185 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 146), షెహ్‌బాజ్ అహ్మద్(244 బంతుల్లో 17 ఫోర్లు, 4 సిక్స్‌లతో 167) సెంచరీలతో చెలరేగారు. వైభవ్(8)తో పాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(4)కూడా నిరాశపర్చాడు.

భారీ విజయం దిశగా ఈస్ట్ జోన్..

అనంతరం నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకు ఆలౌటైంది. అభిజిత్ సర్కార్(5/20) ఐదు వికెట్లు తీయగా.. షెహ్‌బాజ్ అహ్మద్(3/20) మూడు వికెట్లు పడగొట్టాడు. అనుకుల్ రాయ్‌కు ఒక వికెట్ దక్కింది. మహమ్మద్ షమీ ఒక్క వికెట్ తీయలేకపోయాడు. దాంతో నార్త్ ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడుతుండగా.. 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగుతోంది.

Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌ సూర్యవంశీకి బిగ్ షాక్!

Also Read

Vaibhav Sooryavanshi: తొలి మ్యాచ్‌లోనే వైభవ్‌ సూర్యవంశీకి బిగ్ షాక్!

అనుకుల్ రాయ్(3/23) మూడు వికెట్లు తీయగా.. వైభవ్ సూర్యవంశీ(2/11) రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్, అభిజిత్ సర్కార్, షెహ్‌బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు. మరో రెండు వికెట్లు తీస్తే ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ తేడాతో గెలవనుంది.

Story first published: Tuesday, August 25, 2026, 12:44 [IST]
Other articles published on Aug 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+