Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vaibhav Sooryavanshi: 4, 6, 4, 4 ఔట్.. బుడ్డోడు ఇక మారడు!(వీడియో)

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కానీ మళ్లీ హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. దులీప్ ట్రోఫీ 2026 టోర్నీలో ఈస్ట్ జోన్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ.. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల సునామీ సృష్టించాడు. బెంగళూరులోని సీఓఈ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో శతకం చేజార్చుకున్న వైభవ్ సూర్యవంశీ.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహా బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ ముంగిట ఔటయ్యాడు.

వైభవ్ విధ్వంసం..

159 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఈస్ట్ జోన్‌కు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉండటంతో ఆచితూచి ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 4, 4 బాదిన వైభవ్ సూర్యవంశీ.. అదే జోరులో మరో భారీ షాట్ ఆడబోయి రజత్ పాటిదార్ అద్భుతమైన క్యాచ్‌తో వెనుదిరిగాడు. వైభవ్.. 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు.

Duleep Trophy 2026 Vaibhav Sooryavanshi Hits 4 6 4 4 Before Dismissal in Same Over

అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించాడు. వైభవ్ ఔటైన వెంటనే అభిమన్యు ఈశ్వరన్(24) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో విరాట్ సింగ్(3 బ్యాటింగ్), కుమార్ కుశాగ్ర(4 బ్యాటింగ్) ఉన్నారు. ఈస్ట్ జోన్ విజయం సాధించాలంటే ఇంకా 87 పరుగులు చేయాలి. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 8 వికెట్లు తీయాలి. పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో ఇరు జట్లను విజయం ఊరిస్తోంది.

బుడ్డోడు ఇక మారడు..

వైభవ్ దూకుడుగా ఆడుతున్నా.. కండిషన్స్‌ను గౌరవించాలని నెటిజన్లు సూచిస్తున్నారు. పరిస్థితులకు తగ్గట్లు ఆడితేనే టెస్ట్ క్రికెట్‌లో నిలదొక్కుకోగలడని కామెంట్ చేస్తున్నారు. వరుసగా భారీ షాట్స్ ఆడినప్పుడు కాస్త సంయమనం పాటించాలని, మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలుచుకోవాలని హితవు పలుకుతున్నారు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ క్రీజులో ఇంకాసేపు ఉండి ఉంటే ఈస్ట్ జోన్ విజయం ఈజీ అయ్యేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్.. 80.1 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. రింకూ సింగ్(88 బంతుల్లో 8 ఫోర్లతో 60) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. ఆర్య జుయల్(113 బంతుల్లో 6 ఫోర్లతో 46) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్(3/56), అభిజిత్ సర్కార్(3/38) మూడేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, మహమ్మద్ కౌనైన్ రెండేసి వికెట్లు తీసారు.

వైభవ్ తర్వాత..

అనంతరం ఈస్ట్ జోన్ 57 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ (81 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92)తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. అభిమన్యు ఈశ్వరన్(69) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వైభవ్ ఔటైన తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. అమాన్ మోకాడ(41) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Story first published: Tuesday, September 1, 2026, 15:02 [IST]
Other articles published on Sep 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+