Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Duleep Trophy 2026: తిలక్ వర్మ అజేయ శతకం.. విజయం ముంగిట సౌత్ జోన్!

దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా నార్త్ జోన్‌తో జరుగుతున్న సెమీఫైనల్-2లో సౌత్ జోన్ పట్టు బిగించింది. తిలక్ వర్మ(250 బంతుల్లో 9 ఫోర్లతో 116 నాటౌట్) అజేయ శతకంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అనంతరం బౌలింగ్‌లోనూ సత్తా చాటడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్ 66 ఓవర్లలో 7 వికెట్లకు 256 పరుగులు చేసింది.

IND vs AFG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గుండు బాస్ ఔట్!

IND vs AFG: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. గుండు బాస్ ఔట్!

సనత్ సంగ్వాన్(148 బంతుల్లో 8 ఫోర్లతో 76), ఆయుష్ డోసెజా(76 బంతుల్లో 5 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలో రాణించారు. క్రీజులో అన్షుల్ కాంబోజ్(29 బ్యాటింగ్) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్, కావురి సాయితేజ, మహమ్మద్ నిదీష్ రెండేసి వికెట్లు తీయగా.. విద్వత్ కావేరప్ప ఒక వికెట్ పడగొట్టాడు.

Duleep Trophy 2026 Tilak Varma Unbeaten Ton Puts South Zone in Driving Seat Against North Zone

ప్రస్తుతం నార్త్ జోన్ 139 పరుగుల ఆధిక్యంలో ఉంది. బుధవారం ఈ మ్యాచ్‌కు ఆఖరి రోజు. తొలి సెషన్‌లోనే నార్త్ జోన్ మిగతా మూడు వికెట్లు తీస్తే సౌత్ జోన్ ముందు 200 లోపు లక్ష్యం నమోదవుతుంది. అప్పుడు సౌత్ జోన్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కు అర్హత సాధించవచ్చు. ఈ మ్యాచ్ డ్రా అయినా టోర్నీ రూల్స్ ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన సౌత్ జోన్ ఫైనల్ చేరుతుంది.

ఇక 285/9 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌత్ జోన్ 100.3 ఓవర్లలో 312 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోర్‌కు 27 పరుగులు జోడించిన అనంతరం టెయిలండర్ కావురి సాయితేజ(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సౌత్ జోన్ ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ అజేయంగా నిలవగా.. శ్రేయస్ గోపాల్(169 బంతుల్లో 11 ఫోర్లతో 87) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో గుర్నూర్ బ్రార్ (4/88) నాలుగు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అన్షుల్ కాంబోజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అబిద్ ముస్తాక్‌కు ఒక వికెట్ దక్కింది.

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?

Also Read

IPL 2027: ముంబై ఇండియన్స్‌లో కీలక మార్పులు.. జట్టులోనే హార్దిక్ పాండ్యా! కోచ్, కెప్టెన్ ఎవరంటే?

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ 59.1 ఓవర్లలో 195 పరుగులకు కుప్పకూలింది. ఖమ్రాన్ ఇక్బాల్(182 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కన్హయ వధవాన్(35) పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌత్ జోన్ బౌలర్లలో విద్వత్ కావేరప్ప(4/64) నాలుగు వికెట్లు తీయగా.. నిదీష్(2/36), తనయ్ త్యాగరాజన్(2/31) రెండేసి వికెట్లు పడగొట్టారు. కావురి సాయితేజ, శ్రేయాస్ గోపాల్‌కు చెరో వికెట్ దక్కింది.

Story first published: Tuesday, September 1, 2026, 18:40 [IST]
Other articles published on Sep 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+